"అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్"

 *రామగుండము పోలీస్ కమీషనరేట్*
 *అంతరాష్ట్ర దొంగ అరెస్టు*
 
 *14 తులాల బంగారు ఆభరణాలు వాటి విలువ 7,50,000/-*

రామగుండము పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లమపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్, ఎసిపి ఎడ్ల మహేష్ లు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది 

            మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లో తాళ్ళగూరిజాల పోలీసు స్టేషన్ పరిధి లో కె. బాబు రావు, సి. ఐ బెల్లంపల్లి రూరల్ గారు గస్తీ నిర్వహిస్తున్న క్రమం లో నేరస్తుడు అనుమానాస్పదంగా కనపడగ, అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఒక సంచి లో విలువైన బంగారు నగలు ఉండగా, వాటికి అతను సరైన సమదానం చెప్పకపోవడం తో, పోలీసు వారు అతన్ని విచారించగ నేరస్తుడు బెల్లంపల్లి చుట్టుపక్కన నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. 

*నిందితుని నేర  నేపధ్యం......*

నిందితుడు మొదటగా 2009 సంవత్సరం కల్లూర్ గ్రామం లో ఒక యజమాని ఇంట్లో పని కుదుర్చుకొని మొదటిసారిగా యజమాని ఇంట్లో 10,000/- రూపాయలు దొంగతనం చేసి పట్టుపడి జైలుపాలు అయ్యాడు.  ఆ తర్వాత నుండి ఇట్టి నిందితుడు జల్సాలకు, దూరాలవాట్లకు అలవాటు పడి దొంగతనలు చేస్తూ ఉన్నాడు. తన పద్దతి మార్చుకోకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో దొంగతనలు చేస్తూ జైలుపాలు అయ్యాడు. అదే విదంగా తన పంథా మార్చుకొని కొత్త ప్రాంతం లో నేరం చేస్తే ఎవరు నన్ను గుర్తుపట్టరని బెల్లంపల్లి పట్టణాన్ని ఎంచుకొని, బెల్లంపల్లి చుట్టూ పక్కన ప్రాంతాల్లో నేరాలు చేస్తూ, మంచిర్యాల మరియు బెల్లంపల్లి రైల్వే మరియు బస్ స్టాండ్ లలో ఉంటూ ఇట్టి నేరాలు చేయటం జరిగింది. *మొదట గా బెల్లంపల్లి-1  టౌన్ ఏరియా లో -2 దొంగతనలు, తాళ్ళగూరిజల పోలీసు స్టేషన్ పరిధి లో -2 దొంగతనలు  మరియు తాండూర్ పోలీసు స్టేషన్ పరిధి లో-1 బంగారు, వెండి మరియు నగదు దొంగతనలు చేసినాడు.* దొంగతనం చేసిన సోత్తు లో కొంత తక్కువ ధరకు గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొని, వాటితో వచ్చిన డబ్బుల లతో జల్సాలు చేసేనాడు. నిందితుని  వద్ద నుండి 14 తులాల బంగారు ఆభరణాలు వీటి విలువ 7,50,000/- రూపాయలు స్వాదీనపర్చుకొని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్ట్ లో హాజరు పర్చబడును.

*నిందితుని వివరాలు:*

*కొమ్మనబోయిన సీతారాములు, తండ్రి: పెరుమయ్య, 30 సం, కులం: ముదిరాజ్, కూలీ, నివాసం: కల్లూర్ గ్రామం మరియు మండలం, ఖమ్మం జిల్లా.*

*జప్తు వివరాలు* 

 14 తులాల బంగారు ఆభరణాలు వాటి విలువ 7,50,000/-

*నేరస్తుని గత నేరములు పోలీస్ స్టేషన్ ల వారిగా :-*

కల్లూర్- 2, సత్తుపల్లి-1, కొత్తగూడెం-II టౌన్-2 నందిగామ-1, కణిజెర్ల-1, గుర్రం పోడు-1, చండూరు-1, మహబూబ్ బాద్-1, సూర్యపేట-2, వరంగల్-2, హుజూర్నగర్-2, నల్గొండ -2, జగ్గయ్యపేట-1, పెనుగంటిప్రోలు-1. గంపల గూడెం-1

*బెల్లంపల్లి ఏరియా లో వరుస దొంగతనలు అవుతున్నాయని, ఏ.మహేశ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, బెల్లంపల్లి గారు నిందితున్ని పట్టుకోవడానికి  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా,  దానిలో బాగంగా నిందితున్ని పట్టుకోవడం జరిగింది. చాకచక్యంగా నిందుతున్ని పట్టుకోవడం లో ఎంతో ప్రతిభ కనబర్చిన కె. బాబు రావు, సి. ఐ బెల్లంపల్లి రూరల్, ఎం.రాజు, బెల్లంపల్లి-1 టౌన్ ఇన్స్పెక్టర్, కె.జగదీష్, తాండూర్ సి. ఐ, బి.సమ్మయ్య, ఎస్.ఐ.మాదారం మరియు సిబ్బంది సంపత్, శ్రీనివాస్, మల్లేశ్, రఫీ, వినోద్ లను శ్రీ. అఖిల్ మహాజన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, మంచిర్యాల మరియు ఏ.మహేశ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, బెల్లంపల్లి గార్లు అభినందించి రివార్డ్ ప్రకటించారు*.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026