"*న్యాయ విజ్ఞాన సదస్సు*"

"*నేటి 👁️నిఘా 🔎 న్యూస్ 📰 పేపర్ 💢డిజిటల్ 📮మీడియా🖥️* 
✍️అవినీత అక్రమాల పై నిఘా 🔎
"*న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు"*


సిర్పూర్ టి మండల కేంద్రంలోని లోన వెళ్లి గ్రామం  గ్రామపంచాయతీ ఆవరణ లో సిర్పూర్ టి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు గౌరవ ప్రధానమైన న్యాయమూర్తి, పి. రవి అధ్యక్షతన కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలీషా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. కిషోర్ కుమార్, న్యాయవాదులు గణపతి, కళ్యాణ్, కోర్టు సిబ్బంది బి. రమేష్, సిర్పూర్ టి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవికుమార్  పోలీస్ సిబ్బంది సమక్షంలో సిర్పూర్ టి మండలం లోన్ వెళ్లి గ్రామస్తుల కోసం న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ సదస్సులో గౌరవనీయులైన న్యాయమూర్తి పి. రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పిస్తూ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలు 11 నెలలు 9 రోజు కష్టపడి పట్టుదలతో కృషిచేసి రచించిన భారత రాజ్యాంగం ఇట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన  ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతలు, భారత రాజ్యాంగ  ఆర్టికల్ లను చదివి వివిధ రకాల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అత్యవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నట్లయితే లోక్ అదాలత్ లో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి చిన్న చిన్న విషయాల పై కేసు నమోదు చేసుకొని పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరిగి మీ అమూల్యమైన సమయాన్ని కష్టపడి సంపాదించిన డబ్బులను వృధా చేసుకోకూడదని హితవు పలికారు. అనంతరం ప్రజల యొక్క ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అని తెలిపారు.

 తెలంగాణ రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ నేటి నిఘా న్యూస్ ఛానల్ ప్రతినిధి మొహమ్మద్ కబీర్ అహ్మద్.



Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026