"బియ్యం పంపిణీ పథకం పై నిర్లక్ష్యం పై బీజేపీ నిలదిత"
"బియ్యం పంపిణీ పథకం పై నిర్లక్ష్యం"
*నేటి నిఘా న్యూస్*
*ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి వ్యక్తికి 10 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని ప్రస్తుతం అట్టి ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదల నుండి పైసలు తీసుకొని 6 కిలోలు మాత్రమే ఇస్తుందని తెలిపారు*
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలోఈ రోజు ఇందిరా మార్కెట్లో గల రేషన్ షాపును భాజపా పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ ఆధ్వర్యంలో డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శిస్తూ
*మాట్లాడుతూ గత రెండు సంవ్సరాలుగా కోవిడ్ మహమ్మారి తో బాధపడుతున్న ప్రజలను ఆదుకోవడం కోసం మోదీజీ ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) పథకాన్ని ప్రవేపెట్టి ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించడం జరిగిందని పేర్కొన్నారు.*
*అయితే ఈ నెల నుండి ప్రతి వ్యక్తికి కేవలం 6 కిలోలు ఇచ్చి, కిలో బియ్యానికి రూపాయి వసూలు చేయడం దారుణమన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తే,తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఈ పథకాన్ని పక్కనపెట్టి ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడం అన్యాయం అన్నారు.*
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గూడ రాకేష్, మాచర్ల శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, చిప్ప రమేష్, చిప్పకుర్తి శ్రీనివాస్, పాగిడి రాకేష్, కొండ తిరుపతి, కౌశిక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ స్థాయి ఆర్టిఐ లైవ్ న్యూస్, నేటి నిఘా తెలుగు దినపత్రిక, ఆర్టిఐ న్యూస్ పేపర్, డిజిటల్ మీడియా ప్రతినిధి మహమ్మద్ కబీర్ అహ్మద్.
Comments
Post a Comment