"సి సి రోడ్డు నాసిరకం పనులు"

"సీసీ రోడ్డు పరిస్థితి"
*నేటి నిఘా న్యూస్ మీడియా*

*బాల్కొండ నియోజకవర్గం*
   *నిజామాబాద్ జిల్లా* 

*నాణ్యతలేని సిసి రోడ్ల నిర్మాణలు పర్యవేక్షించని అధికారులు,ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు*

*మోర్తాడ్(మే 2022 )*
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం లోని దొనకల్ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుష్కలంగా నిధులు మంజూరు చేస్తూనే ఉన్నారు.ప్రతి గల్లి గల్లి కి సిసిరోడ్డు అయ్యేలా మంత్రి నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, కొందరు ప్రజా ప్రతినిధులు నాయకులు పర్సెంటేజీ లకు పరిమితం కావడం, కాంట్రాక్టర్లు సైతం పర్సెంటేజ్ లు తీసుకుని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో సిసి రోడ్ల నిర్మాణం పనులు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాణ్యత లేని పనులు చేపట్టడం వల్ల వేసిన నెల రోజులకే పగుళ్ళు, ఆరు నెలలకు, ఏడాదిలోపు సిమెంటు కొట్టుకుపోయి కంకర తేలడంతో స్థానిక గ్రామస్తులు సిసి రోడ్ల నిర్మాణం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సిసి రోడ్ల నిర్మాణం జరిగిన వెంటనే సిసి రోడ్లకు నీటిని క్యూరింగ్ పట్టాల్సి ఉండగా ఎవరి ఇంటి ముందు వారే పట్టుకోవాలని కాంట్రాక్టర్లు,తెరాస నాయకులు కొందరు చెబుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిసి రోడ్ల నిర్మాణాలు జరిగిన తర్వాత సిసి రోడ్లకు ఇరువైపులా మట్టిపోసి చేయాల్సి ఉండగా మొరం గాని, మట్టి వేయడం లేదని, దీంతో ప్రమాదాలకు నిలయంగా మారాయని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కఠిన ఆరు నెలలకు మూడు నెలలకు ఇప్పుడు మొరంతెచ్చి పోస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అధికార పార్టీ నాయకులకు భయపడి అధికారులు చేసేదేమీలేక పనులు ఎలా జరిగినా బిల్లులు చెల్లిస్తున్నారని స్థానిక రైతులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది ఫీట్లు, ఎనిమిది ఫీట్లు 9 ఫీట్లు ఇలా నచ్చిన తీరులో సిసి రోడ్లను కాంట్రాక్టర్లు నిర్మిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతి గల్లి గల్లి కి సిసి రోడ్డు నిర్మాణం కొరకు కృషి చేస్తున్నప్పటికీ, ఒకరిద్దరు ప్రజా ప్రతినిధుల, నాయకుల ఒత్తిడి మేరకు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్నారని కనీసం సిసి రోడ్లకు నీటినిపట్టడం లేదని, దీంతో పదికాలాలపాటు నిలవాల్సిన సిసి రోడ్లు సంవత్సరంలో కొట్టుకుపోతున్నాయి, మంత్రి ఎంత అభివృద్ధి చేస్తున్న వృధా అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాణ్యత లేని పనులు చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణాలకు బిల్లులు నిలిపివేయాలని, నాణ్యత పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ల లైసెన్సులు, తొలగించాలని, పర్యవేక్షించిన అధికారులపై చర్యలు చేపట్టాలని, మళ్లీ ఇలా నాణ్యత లేని పనులు చేపట్టకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026