"TWJ జిల్లా సమావేశాలు"

*"జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. నేటి నిఘా న్యూస్.
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నేతల పిలుపు*"
*"సమాజంలో మీడియా స్పేచ్చకు, జర్నలిస్టుల హక్కులకు ప్రమాదం ఏర్పడుతోందని, జర్నలిస్టులు ఐక్యతతో అప్రమత్తంగా ఉండాలని  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నేతలు అన్నారు. మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు పోరాటానికి జర్నలిస్టులు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు*"

. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టినియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ మండలంలోనీ వృద్ధుల సంక్షేమ విశ్రాంతి భవనంలో జిల్లా కన్వీనర్ టి. సురేందర్ రావు అధ్యక్షతన జరిగిన
  మహాసభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఇళ్ళస్దలాలు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను పరిష్కరిస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీలను గాలికొదిలేసి జర్నలిస్టులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పలు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులను అప్రమత్తం  చేసి త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని  ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు ఇళ్ళస్దలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో జర్నలిస్టుల ఫెడరేషన్ ను బలోపేతం చేసి జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలిపారు.
అనంతరం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా సురేందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సతీష్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు గా మహేష్, ఉపాధ్యక్షులుగా సంతోష్, ప్రకాష్, కార్యదర్శిగా రాజశేఖర్, కోశాధికారిగా కృష్ణ మోహన్ గౌడ్, జాయింట్ సెక్రటరీలు గా ఆసిఫ్, శ్రీనివాస్, దాస్, కార్యవర్గ సభ్యులుగా నాగేంద్ర,  విష్ణు గౌడ్, నవ కాంత్, అనిల్ కుమార్, అవినాష్, ఆర్టిఐ లైవ్ న్యూస్ ఛానల్ నుండి మొహమ్మద్ కబీర్ అహ్మద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొంటున్నట్లు తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్రం కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి, నియోజకవర్గ స్థాయి ఆర్. టి. ఐ. న్యూస్ ఛానల్ & నేటి నిఘా తెలుగు జాతీయ దినపత్రిక ప్రతినిధి మహమ్మద్ కబీర్ అహ్మద్.

*"జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి.

నేటి 👁️నిఘా 🔎న్యూస్ 🗞️పేపర్ 📮డిజిటల్ 🖥️మీడియా🎯
అవినీతి అక్రమాల పై📰నిఘా🔎న్యూస్🌏🗞️📰🖥️📮💢
Ads ☎️7097988840
రిపోరటర్స్ కావలెను.
ఎడిటర్ 
కట్టా నరేష్ కుమార్ నాయక్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026