"గ్రేట్ హైదరాబాద్ లో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు"

"తెలంగాణ ప్రెస్ అకాడమీ జర్నలిస్ట్ లకు శిక్షణ తరగతులు"
తెలంగాణ రాష్ట్ర మీడియాా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు 
హైదరాబాద్, ఆర్టీసీ కళ్యాణ మండపం లో
 తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ జర్నలిస్టుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో గ్రేట్ హైదరాబాద్ లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా,
*జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాలు*
ఆచరణ అనివార్యం...
పాత్రికేయులపై గురుతర బాధ్యత...
శిక్షణలో నేర్చుకున్నది ప్రాక్టికల్ గా చూపెట్టండి...
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హితవు...
అభినందించి సత్కరించిన  జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనియన్ నేతలు....
 "జర్నలిస్టుల శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల ప్రధానం చేసిన TS  అకాడమీ చైర్మెన్"
హైదరాబాద్, 
ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాలు కు హాజరైన జర్నలిస్టులకి శుభాఅభిందనలు తెలిపారు.
నేటి నిఘా న్యూస్ మీడియా ఎడిటర్ కట్టా నరేశ్ కుమార్ నాయక్ కు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ చే సర్టిఫికెట్  అందజేశారు, భక్తి శ్రీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్  లక్ష్మీనారాయణ, న్యూస్ ఇండియా నెట్ వర్క్ జర్నలిస్ట
 సత్య, బ్రేకింగ్ న్యూస్ ఛానల్, సాయి కుమార్, బి ఎస్ 9 న్యూస్ మీడియా నెట్ వర్క్ ఇంఛార్జి  జర్నలిస్ట్ అలివెని, ఆర్టీఐ న్యూస్ మీడియా గ్రూప్ శ్రీనివాస్,కు  సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు 
 గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులలో పాల్గొన్న విలేకరులు, తాము నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టాలని  తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.రాష్ట్రంలో అకాడమీ 9 ఉమ్మడి జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా ఆరు వేల మంది జర్నలిస్టులు లబ్ధి పొందారని, అదేవిధంగా దళిత జర్నలిస్టు శిక్షణా తరగతులు, మహిళా జర్నలిస్టుల శిక్షణా తరగతులు, గ్రేటర్ హైదరాబాదు  జర్నలిస్టుల శిక్షణా తరగతుల వల్ల మరో 1000 మంది లబ్ది పొందినట్లు ఆయన తెలిపారు. అకాడమీ 12 పుస్తకాలు  ప్రచురించి జర్నలిస్టులకు అందజేసినట్లు, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనం లో ఒక ఆడిటోరియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయని, అప్పుడు మరింత ఉపయోగకరంగా తరగతులు నిర్వహిస్తామని చైర్మన్ అన్నారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర  యూనివర్సిటీల  సహకారం తో మీడియా అకాడమీ జర్నలిస్టుల కొరకు ఒక బ్రిడ్జి కోర్స్ రూపొందిస్తుందని, ఇది ఒక సర్టిఫికెట్ కోర్స్ గా ఉంటుందని ఈ సందర్బంగా తెలిపారు.
90 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్, మహిళ విజయం మాస పత్రిక సంపాదకురాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా రెండు రోజుల శిక్షణ తరగతులు పాల్గొన్న కొందరు జర్నలిస్టులకు సర్టిఫికెట్స్ అందజేశారు.
హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ, ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ రోజు జరిగిన తరగతులలో నాలుగు అంశాలపై మీడియా నిపుణులు ప్రసంగించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ అధ్యక్షులు, ఘంటా చక్రపాణి 'మీడియా లో నైతిక ధోరణులు జండర్ సెన్సిటైజేషన్',  శ్రీనివాస్ రెడ్డి  6tv,  'డిజిటల్ మీడియా', టైమ్స్ ఆఫ్ ఇండియా, సుధాకర్ రెడ్డి  'నేర వార్తలు' , జై తెలంగాణ టీవీ, బుచ్చన్న ' ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పరస్పర ఆధారితాలు' అంశాలపై ప్రసంగించి, జర్నలిస్టుల సందేహాలు కు సమాధానాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు,  జర్న లిస్టు  అసోసియేషన్  ఆఫ్   తెలంగాణ వర్కింగ్  ప్రెసిడెంట్ ,నక్క మల్లికార్జున, హైదరాబాద్ జిల్లా పి జె ఏ  అధ్యక్షుడు  రంగయ్య, రాష్ట్ర పి జె ఏ ఆఫ్ తెలంగాణ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఇ. వెంకటేయ్య, టీయూడబ్ల్యూజే కార్యదర్శి మారుతి సాగర్,  టీయూడబ్ల్యూజే,. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్,
 డి జే ఎఫ్, నసిరొద్ధిన , రాష్ట్ర కార్యదర్శి కట్టా నరేశ్ కుమార్ నాయక్, డీ జే ఎఫ్,. రాజ్ కుమార్, సంతోష్ రెడ్డి, యూనియన్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
  కార్యదర్శి, నవీన్ కుమార్, టీయూడబ్ల్యూజే నాయకురాలు, కట్ట కవిత, వాణి శ్రీ, అలివేనీ, స్వాతి, ఉప్పల లక్ష్మ నారాయణ గుప్త, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో మీడియాా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్న చైర్మన్ అల్లం నారాయణ 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కు మీడియా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026