"సైబర్ నేరాల పై సమీక్ష"
*ఆన్లైన్ మోసాల్లో అప్రమత్తత అవశ్యకం….*
"నేటి నిఘా న్యూస్"
న్యూస్ లైన్ ప్రతినిధి నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావద్దు.*
*సైబర్ దొంగలు డబ్బు దోచేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయండి*
*NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. : సిపి రామగుండము*
కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ చేసి ఫోటో లను న్యూడ్ ఫోటో లుగా మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తాము ,ఫోటోలు పంపిస్తాం ,యు ట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అంటూ ఇబ్బంది పెడుతున్నారు. పార్ట్ టైం జాబ్ ఇస్తామని, లాటరీ వచ్చింది అనో, గిఫ్ట్ వచ్చిందనో, కేవైసి అప్డేట్ చేయాలని చెప్పి సైబర్ నేరగాళ్లు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారు. మరికొందరు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ దొంగిలించి అందులోని డబ్బును వాడుకుంటున్నారు. నకిలీ వెబ్g సైట్లతో మోసం చేసే వాళ్లు మరికొందరు కార్డ్ స్వైపింగ్, లోన్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ ద్వారా నేరాలు చేసేవాళ్ళూ ఉన్నారు. సిమ్ కార్డు దొంగతనంగా పొంది సైబర్ నేరాలు జరిగిన ఘటనలూ చాలా ఉన్నాయి అని ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల మోసాల్లో పడకుండా అప్రమత్తంగా ఉండడం అవశ్యకం అని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్,.(ఐజి) తెలిపారు.
*సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే ...సైబర్ పోలీసుల వారి సూచనలు తప్పక పాటించండి:*
1. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ వస్తే యాక్సెప్ట్ చేయకండి.
2. . కస్టమర్ కేర్ నెంబర్ ల కొరకు ఎట్టిపరిస్థితుల్లో గూగుల్ లో వెతకకండి సంబంధిత అధికారిక వెబ్ సైట్ అప్లికేషన్స్ లోనే ఫిర్యాదుల కొరకు నెంబర్ ఉంటుంది
3. . ANY Desk application డౌన్లోడ్ చేసుకోమని ఎవరైన చెప్పితే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గ్రహించండి.
4. . Instagram, Face book & You tube లలో వచ్చే ఎటువంటి యాడ్ లను చూసి ఎటువంటి వస్తువులు కొనవద్దు మోసపోవద్దు.
5. . ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఎవరైనా డబ్బులు కట్టమంటే కట్టవద్దు.
6. . వివాహ సంబంధ వెబ్‌సైట్లలో వ్యక్తిని చూడకుండా ఆకర్షణకు లోను కావద్దు. డబ్బులు ఎవరి ఖాతాలోనూ వెయ్యవద్దు.
7. . OLX, Quikr, Cardeko వెబ్‌సైట్లలో వస్తువులను డైరెక్టుగా చూడకుండా, అమ్మే వ్యక్తులను డైరెక్టుగా కలవకుండా ముందుగా డబ్బులు కట్టవద్దు.
8. . కస్టమర్ కేర్ వాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయవద్దు.
9. . తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటే నమ్మవద్దు. ఏ ఫీజూ కట్టవద్దు.
10. . ఎవరైనా మెసేజ్/కాల్ చేసి మీకు లోన్ అప్రూవ్ అయ్యింది అని అంటే నమ్మకండి.
11. . బహుమతి వచ్చిందంటూ మీకు తెలియని వ్యక్తుల నుంచీ మెసేజ్ వస్తే అస్సలు నమ్మవద్దు.
12. . రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్ ల నుంచి లోన్ తీసుకోకండి, వారు పెట్టె బాధలకు గురికావొద్దు.
13. . "కాశ్మీర్ ఫైల్స్" RRR, లాంటి పెద్ద హిరోల సినిమా ఉచితంగా చూడండి అని వాట్సాప్ లో ఏదయినా లింక్ వస్తే క్లిక్ చేయకండి. ఈ అనుమానాస్పద లింక్ మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయవచ్చు. జాగ్రత్త.
*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు...*
1. మంచిర్యాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు DONAZ, QUICK LOAN వంటి లోన్ అప్లికేషన్ లో Rs. 50 వేలు లోన్ తీసుకుని తిరిగి చెల్లించాడు. అయినప్పటికిని మరలా కాల్ చేసి మీరు లోన్ పే చెయ్యలేదు మళ్లీ పే చేయండి లేకపోతే మీ బంధువులకి ఫోన్ చేస్తాము అంటూ ఇబ్బంది పెడుతున్నారు, బాధితుడి యొక్క ఫోటో లను న్యూడ్ ఫోటో లుగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్ చేస్తున్నారు
2. పెద్దపల్లి పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి పార్ట్ టైం జాబ్ గురించి మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిష్టర్ అయిన తర్వాత WhatsApp లో మరోక లింక్ పంపి, ఈ లింక్ క్లిక్ చేయండి కొన్ని వస్తువులు ఉంటాయి, ముందు మీరు ఆ వస్తువులను మీ డబ్బులతో కొనండి తర్వాత కమిషన్ తోపాటు మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాము అని చెప్పగా, Rs. 2 లక్షలతో పలు దఫాలుగా కొన్ని వస్తువులను కొన్నాడు, కమిషన్ తో కలుపుకొని మొత్తం డబ్బు వ్యాలెట్ లో కనిపిస్తుంది కానీ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదరట్లేదు. మీర మరి కొన్ని కొనండి అపుడే మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదురుతుంది అంటూ వల విసురుతున్నారు..
3. మంథని పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితునికి వాట్సాప్ లో తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది బాధితుడు వీడియో కాల్ యాక్సెప్ట్ చేయగా అందులో ఒక అమ్మాయి న్యూడ్ గా ఉంది. ఇతను ముఖము కూడా వీడియో కాల్ లో కనబడటంతో ఆ అమ్మాయి ఆ కాల్ రికార్డ్ చేసి డబ్బులు ఇవ్వాలి లేకపోతే యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తా అంటూ ఇబ్బంది పెడుతుంది. మరొక సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మేము ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను మీ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ కాబోతుంది అవ్వకుండా ఉండాలి అంటే Rs 31 వేలు క్యాన్సిలేషన్ చార్జి కోసం పంపాలి అనగా బాధితుడు పంపాడు
4. లక్షెట్టిపేట పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి ఫోన్ పే క్యాష్ రివార్డ్ అంటూ గూగుల్ లో ఒక స్క్రాచ్ కార్డు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది.. బాధితుడు ఆ స్క్రాచ్ కార్డ్ నీ స్క్రాచ్ చేసి కింద SEND AMOUNT TO BANK అనే బటన్ ప్రెస్ చేయగా ఫోన్ పే ఓపెన్ అయింది. ఫోన్ పే MPIN ఎంటర్ చేయగా బాధితుడి అకౌంట్ నుంచి RS. 893/- పోయాయి.
5. బెల్లంపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి కాల్ చేశాడు. ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ( సైబర్ నేరగాళ్లు) మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ANY DESK అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోండి అని చెప్పగా చేసుకుని, యాక్సిస్ ఐడీ నీ కూడా షేర్ చేశాడు. ATM CARD డీటెయిల్స్ కూడా చెప్పేసాడు. ANY DESK అప్లికేషన్ ద్వారా అతనికి వచ్చిన OTP లు చూసిన సైబర్ నేరగాళ్లు Rs. 15 వేలు కొట్టేశారు.
6. మంచిర్యాల్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడి ఫోటోలతో వాట్స్అప్ క్రియేట్ చేసుకున్న సైబర్ నేరగాడు తాను చాలా అర్జెంట్ అవసరం లో ఉన్నాను అని అమౌంట్ సెండ్ చేయాలి అని బాధితుడు యొక్క స్నేహితులకు మెసేజ్లు చేస్తున్నాడు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
*ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్.,(ఐజి)* *కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం* ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*** *** ***
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
Comments
Post a Comment