నేటి👁️నిఘా🔎న్యూస్📰పేపర్💫డిజిటల్ 🖥️మీడియా🌏

 నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.

Ads ☎️7097988840.

నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 📰 పేపర్ 🗞️ డిజిటల్ 💫మీడియా 🖥️

నేటి నిఘా న్యూస్
*సబ్ కా సాత్ - సబ్ కా వికాస్* ఇదే బీజేపీ నినాదం
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*  నేటి నిఘా న్యూస్

కామారెడ్డి జూన్ 6 నేటి నిఘా న్యూస్
న్యూస్ లైన్ ప్రతినిధి .
 ప్రధానిగా మంత్రి నరేంద్ర మోదీ  8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 15 రోజుల కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు   అడ్లూర్ లో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఇంటింటికీ కరపత్రాలు ఇచ్చి మోదీ ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఏ ఒక్క మతానికో , ప్రాంతానికో వ్యతిరేకము కాదని కొంత మంది కావాలనే బీజేపీ గురించి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అన్నారు. సబ్ కా సాత్  సబ్ కా వికాస్ నినాదం తో బీజేపీ గత 8 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందనీ అన్నారు. ట్రిబుల్ తలాక్ రద్దు, 370 ఆర్టికల్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకుందని అన్నారు. దేశంలో మైనరిటిలు బీజేపీ పక్షాన నిలుస్తున్నారని గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


2. నేటి నిఘా న్యూస్

*పల్లె ప్రగతి తో జిల్లాలోని పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయి*
*జిల్లా కలెక్టర్ జితేష్ వి  పాటిల్*

కామారెడ్డి జూన్: పల్లె ప్రగతి తో జిల్లాలోని పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయని  జిల్లా కలెక్టర్ జితేష్ వి  పాటిల్ అన్నారు. లింగంపేట లో సోమవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పారు. హరితహారం నిర్వహణకు ప్రభుత్వం పది శాతం నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే హరితహారంలో మొక్కలు నాటడానికి అధికారులు ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువులను సేకరించడానికి యువత ముందుకు రావాలని  కోరారు. వీధి దీపాల విద్యుత్ వినియోగం కోసం సోలార్ విద్యుత్తు ఉపయోగించుకోవాలని సూచించారు.నాగన్న బావిలో పూడికతీత పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి  కలెక్టర్ శ్రమదానం చేశారు. 
నాగన్న బావి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబు ఉనిషాబేగం , జెడ్పిటిసి సభ్యురాలు శ్రీలత, ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ ప్రభాకర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.


3. నేటి నిఘా న్యూస్.
  *భాగ్య‌న‌గ‌రంలో ఆషాఢ బోనాల తేదీలు ఖ‌రారు* 
హైద‌రాబాద్ వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించే ఆషాఢ బోనాల‌కు ముహుర్తం ఖ‌రారైంది.

ఈ నెల 30న గోల్కొండ బోనాల‌తో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి. 

జులై 17న ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాలు, 

18న రంగం, భ‌విష్య‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. జులై 24న భాగ్య‌న‌గ‌ర బోనాలు, 

25న ఉమ్మ‌డి దేవాల‌యాల ఘ‌ట్టాలు ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు. 

జులై 28న గోల్కొండ బోనాల‌తో ఈ ఉత్స‌వాలు ముగియ‌నున్నాయి.


4. నేటి నిఘా న్యూస్ 
*అంగరంగ వైభవంగా బోనాల పండుగలు*

*ఘనంగా పెద్దమ్మ తల్లి మైసమ్మ తల్లి పండగలు*
కామారెడ్డి జూన్ 6 నగర నిజం: లింగంపేట్ మండల్ మెంగారం  గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి మైసమ్మ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ పోతరాజు విన్యాసాలు లతో గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలు తీశారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని పంటలు మంచిగా పండాలని ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి కి మైసమ్మ తల్లి కి బోనాలు సమర్పించడం జరుగుతుందని వారు అన్నారు. గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు డిజె సప్పుడు ల మధ్య అంగరంగ వైభవంగా బోనాలు వాడ వాడ లో తిరు కుంటూ డప్పు వాయిద్యాల మధ్య బోనాలను అమ్మవారికి సమర్పించారు.  ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


5. నేటి నిఘా న్యూస్.
 *పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురుకుల మహిళా  విద్యార్థులకు భద్రత  అవగాహన కార్యక్రమం* 
కామారెడ్డి జూన్ 6 నగర నిజం: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మార్కల్ కామారెడ్డి నందు సదాశివనగర్ ఎస్సై ఎస్ శేఖర్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి డా వి రాధిక వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి కే వనజ మరియు డిసిప్లేన్   కమిటీ కోఆర్డినేటర్ కుమారి ఎల్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సై శేఖర్ మాట్లాడుతూ నేడు సమాజంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలను విద్యార్థులు తెలుసుకుంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉన్నప్పుడు ఇంటి నుండి వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల తోనే  వెళ్లాలని సూచించారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు సంభాషణలు కొన్నిసార్లు విపరీత పరిమాణాలు దారితీస్తాయని, కనుక జాగ్రత్తగా వారికి దూరంగా ఉండి పెద్దగా చదువుకోని భవిష్యత్ బంగారు బాటలు వేయాలని, తల్లిదండ్రులకు కళాశాల కు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. విద్యార్థులకు సామాజికంగా చక్కటి అవగాహన కల్గించేలా వివరిస్తూ మా విద్యార్థులకు మంచి మాటలు చెప్పి మా విద్యార్థుల భవిష్యత్పై స్ఫూర్తి నింపిన సదాశివనగర్ ఎస్సై శేఖర్ సార్ అలాగే కే పోలీస్ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.



6. నేటి నిఘా న్యూస్.
 *అరెస్టు తప్పు చేసిన నిందితులను చేయండి ప్రశ్నించే గొంతులను అణిచి వేయడానికి కాదు*
*బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్*
కామారెడ్డి జూన్ 6 నగర నిజం: ప్రత్యర్థి పార్టీ నాయకులను అరెస్ట్ చెయ్యడం మీద పెట్టిన శ్రద్ధ లో పావలా వంతు శాంతి భద్రతల మీద పెడితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని, జిల్లా భారతీయ జనతా యువ మోర్చా  బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ అన్నారు.  మైనర్ బాలిక హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించలని డిమాండ్ చేస్తూ నేడు బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారి రాస్తారోకో కార్యక్రమం ఉండగా పోలీస్ లు గత రాత్రి నుండి పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధం చేశారు. తాడ్వాయి మండల పోలీస్ స్టేషన్ లో  అరెస్టు తరువాత విడుదలైన అయన మీడియా తో మాట్లాడుతూ
రాజధాని నడివొడ్డున మైనర్ బాలికపై అత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రధాన నిందితులను ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదని,రాష్ట్రం లో షీ టీమ్స్ ఎక్కడ పోయాయని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా కేసులో అత్యుత్సహం ప్రదర్శించి ఎన్కౌంటర్ చేసిన పోలీస్ వ్యవస్థ నేడు స్వయానా రాష్ట్ర హోమ్ మంత్రి మనువడు ఉంటే సాక్షాలు ఆధారాలు తారుమారు అవుతాయా అని ప్రశ్నిచారు. ఆడపిల్లకు న్యాయం చెయ్యలేని చాతకాని హోమ్ మంత్రి నీ తక్షణమే బర్తరఫ్ చేసి, సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం ఎంఐఎం తొత్తులుగా వ్యవహరించకుండా ఈ ఘటనలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేయాలనీ లేదా కేసును సిబిఐ కీ అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కెసిఆర్ ప్రభుత్వన్ని గద్దె దించేదాక ఉద్యమిస్తామని హెచ్చరించారు.


7 నేటి నిఘా న్యూస్
  *పారిశుద్ధ్య కార్మికులను కులం పేరుతో దూషించిన సింగిల్ విండో చైర్మన్ జైపాల్ రెడ్డి*
కామారెడ్డి జూన్ 6 నగర నిజం: మాందాపూర్  పారిశుద్ధ్య కార్మికులను కులం పేరుతో దూషించిన సింగిల్ విండో చైర్మన్ జైపాల్ రెడ్డి, కామారెడ్డి ఆర్. అండ్. బి. గెస్ట్ హౌస్లో  హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు వేముల బలరాం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ మాట్లాడుతూ గత నెల 31వ తేదీన పారిశుద్ధ కార్మికులు దాకురి రాజు ,జంగం రాజు లను కులం పేరుతో అనుపాటి జైపాల్ రెడ్డి, రెడ్డి అనే అహంకారంతో ఇష్టమొచ్చినట్లు బూతులు మాటలు తిడుతూ, కులం పేరుతో తిట్టడం జరిగిందని, ఇట్టి విజయంపై బిబిపెట్ పోలీస్ స్టేషన్లో జైపాల్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగిందనీ, కులం పేరుతో దూషించిన వ్యక్తి పైన కేసు మాత్రమే నమోదు చేశారనీ, ఇంతవరకు అతనిని కస్టడీలోకి తీసుకోలేదని బయట ఎంజాయ్ గా చేస్తూ తిరుగుతున్నాడని, కులం పేరుతో దూషించిన వ్యక్తి పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మాదిగ హక్కుల దండోరా , ఎమ్మార్పీఎస్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు.
 

8. నేటి నిఘా న్యూస్.
 *లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక*
*జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్*
కామారెడ్డి జూన్ 6 నగర నిజం: లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  తె లిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా సోమవారం మధ్యాహ్నం లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కు 20 సీట్లు కేటాయించారు. మూడో తరగతి లో బాలురకు (6), బాలికలకు (4) కేటాయించారు. ఐదవ తరగతి లో (3) బాలురు ,(2) బాలికలు, ఎనిమిదో తరగతిలో బాలురు(4), బాలికలకు (1) చొప్పున కేటాయించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో  లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.

Ads కోసం సంప్రదింగలరు.


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026