"పారేస్ట్ కాలేజీ కాలేజీలో ధర్నా"
*"పారేస్ట్ కాలేజీ విద్యార్థుల ధర్నా"*
"వార్డెన్ ,కేర్ టేకేర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్"
సిద్దిపేట జిల్లా (న్యూస్ లైన్) 7జూలై 2022.
ములుగు మండలం లో ఫారెస్ట్ రీసెర్చ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు సమస్యలు పై స్థానిక కాలేజ్ లో వార్డెన్ ప్రొఫెసర్ డాక్టర్ మమత అందుబాటులో ఉండకపోవడం తో విద్యార్థులు సమస్యలు గురించి అంశాల పై కేర్ టేకర్ రాజ్ కిరణ్ ను నిలదీసిన విద్యార్థులు సమస్యలు పై దురుసుగా ప్రవర్తించిన సంఘటన
పారెస్ట్ కాలేజ్ లో కేర్ టేకర్ ను ప్రశ్నించిన విద్యార్థులు ను మందలించడంతో గొడవ జరిగింది ఈ సంఘటన గురించి విద్యార్థుల ను ప్రొఫెసర్ డాక్టర్ మమత మరోసారి మందలించడంతో విద్యార్థులు సమస్యలు పై స్థానిక కాలేజ్ లో ఏమి జరిగినా పట్టించుకోకుండా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు ఇక్కడ
కేర్ టేకర్ విద్యార్థులను ఫోటోలు తీయడం బెదిరించడం తో విద్యార్థులు మేస్ దగ్గరకు వచ్చి సమస్యలను చెపితే పట్టించుకోకుండా మేడమ్ కు ఫోనులు చేసి చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి పై విద్యార్థులు నిలదీస్తే దురుసుగా ప్రవర్తించిన కేర్ టేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు తో ఒక్కసారిగా కాలేజ్ లో క్యాంపస్ విద్యార్థులు పై మాట్లాడిన ఆయన వాక్యాల పై వార్డెన్ స్థానికంగా సమస్యల పరిష్కారానికి స్పందించకుండా ఆయన వెనుకేసుకునున్న వచ్చారని విద్యార్థులు అందరూ కలిసి క్లాస్ లు బైష్కరించి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో రోకో చేశారు. విద్యార్థుల సమస్యలను చెపితే టార్గెట్ చేసి కాలేజి నుండి బయటకి పంపిస్తా అని చెప్పేసి బెదిరించి సంఘటన పై కాలేజీ ముందు ర్యాలీగా బయలుదేరి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు ప్రొఫెసర్ డాక్టర్ మమత మేడమ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు సమస్యలు పై స్థానిక కాలేజ్ లో జరుగుతున్న సంఘటన గురించి మాట్లాడుతూ విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు వార్డెన్,
కేర్ టేకర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు.
"పారేస్ట్ కాలేజీ రోడ్డు పై రాస్తారోకో"
సిద్దిపేట జిల్లా ములుగు మండలం లోని
పారెస్ట్ కాలేజీ ముందు ర్యాలీగా బయలుదేరి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వచ్చి పోయే వాహనాలు నిలిపివేశారు. ప్రొఫెసర్, ప్యకల్టీలు కాలేజీ సిబ్బంది వెళ్ళడానికి వీలులేకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఫారెస్ట్ కాలేజీలను సమస్యలపై ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుపై కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ మమత వార్డెన్ గా విధులు నిర్వహించడంలో విఫలమై ప్రాజెక్ట్ ని సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేయడంతో శిక్షణ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించకుండా జాప్యం చేస్తున్న సంఘటన పై స్థానిక అధికారులకు ఈ విషయం వెళ్లడంతో కాలేజీ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనపై ఫారెస్ట్ కాలేజ్ ఉన్నతాధికారులు రాస్తా రోకో నిర్వహిస్తున్న స్థలానికి వచ్చి హామీ ఇచ్చిన విద్యార్థులు శాంతించలేదు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు .
" మీడియాను అడ్డుకోవడం "
ఫారెస్ట్ కాలేజ్ లో జరుగుతున్న సంఘటన పై ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టుల, మీడియా కు సమాచార అందడంతో కాలేజీకి మీడియా ప్రజలు రానివ్వకుండా గేటు బయటనే సెక్యూరిటీతో ఆపేశారు మీడియా ను అడ్డుకోవడంతో అక్కడ జరుగుతున్న విద్యార్థుల రాస్తా రోకో పై నియర్ జర్నలిస్టులు కాలేజిలో జరుగుతున్న వరుస సంఘటనను గురించి సమాచారాన్ని తెలుసుకొని ఉన్నత అధికారులతో మాట్లాడి మీడియా ను అడ్డుకోవడంపై జరుగుతున్న ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అందుబాటులో ఉండకుండా వ్యవహరిస్తున్న విషయంపై మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ఒక్కసారిగా ఫారెస్ట్ కాలేజ్ అధికారులు అలజడి మొదలైంది .
విద్యార్థులు రాస్తారోకో చేస్తున్న సంఘటన స్థలానికి మీడియా ప్రతినిధులు వచ్చి విద్యార్థుల సమస్యలపై వివరాలు సేకరించారు కాలేజీలో జరుగుతున్న అంశాల గురించి ప్రొఫెసర్ డాక్టర్ మమత వార్డెన్ పై అనేక ఆరోపణలు వస్తున్న స్థానికంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏకదటిగా మాట్లాడారు కాలేజీలోని అది పత్యం చెలాయిస్తూ విద్యార్థులపై దురుసుగా వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజ్ కిరణ్ అనే కేర్ టేకర్ తో కలిసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దురుసుగా మాట్లాడుతూ అందరిపై కటువుగా మాట్లాడుతూ విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్న ఈ సంఘటనలు పై చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నరు విద్యార్థులు రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు కాలేజీ ఉన్నత అధికారులు రావడంతో ఒక్కసారిగా వారిని గెరవు చేసి చంబరు వరకు ర్యాలీగా బయలుదేరి విద్యార్థులు డిమాండ్స్ నెరవేర్చడానికి కాలేజీ ఇంఛార్జి ప్రియాంక వర్గీస్ కు సమస్యలు విన్నవించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాలేజీలో జరుగుతున్న సమస్యలు అంశాల గురించి వెంటనే తమ దుష్టికి తీసుకురావాలని విద్యార్థులు చెప్పిన అంశాల పై తక్షణమే చర్యలు తీసుకుంటామని కాలేజీ లో ఈ వారుసా సంఘటనలు పై కారకులైన ప్రోపెసర్ డాక్టర్ మమత, రాజ్ కిరణ్ నీ పిలిపించి మందలించి బాధ్యులు పై చర్యలు తీసుకుంటామని వ్యవహారం కారకులైన వారిని సస్పెండ్ చేస్తున్నాము అని పేర్కొన్నారు. ప్రతి సమస్యను తక్షణమే చర్యలు తీసుకుంటామని వెంటనే కాలేజీ ఫ్యాకల్టీ నీ పిలిచి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. కాలేజీ లో విద్యార్థులు అర్షతిరేఖలు వ్యక్తము చేశారు.
Comments
Post a Comment