అలుగు లో స్కూల్ బస్సు మునిగే

 *అలుగులో చిక్కుకున్న పాఠశాల బస్సు.. స్థానికుల సాహసంతో పిల్లలు సేఫ్​.!*
నేటి నిఘా న్యూస్
మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచ కొత్తచెరువు అలుగు వద్ద పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. వెంటనే స్పందించి స్థానికులు బస్సులోంచి విద్యార్థులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పెనుప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని కొత్తచెరువు అలుగు పారుతోంది. ఈరోజు మరోసారి జోరుగా వర్షం కురవటంతో.. వరద ఎక్కువైంది. రోడ్డుపై నుంచి మోకాలి ఎత్తుతో నీరు వెళ్తోంది. ఈ విషయం తెలియని.. తొర్రూర్​ ఆర్యభట్ట పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో అదే దారి వెంట వెళ్లగా.. ప్రమాదవశాత్తు అలుగు మధ్యలో చిక్కుకుపోయింది.
వరద పెద్ద ఎత్తున పారుతుండటంతో.. దారి సరిగ్గా తెలియక బస్సు టైరు రోడ్డు దిగింది. బస్సు ఓ వైపు వంగిపోవటంతో డ్రైవర్​.. వెంటనే బస్సును అక్కడే ఆపేశాడు. వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. టైర్లు మునిగేలా వస్తున్న వరదను చూసి.. చిన్నారులు పెద్ద ఎత్తున అరవటం ప్రారంభించారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. బస్సులో ఉన్న చిన్నారులను హుటాహుటిన ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
 
Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026