"తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్"
"తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు సాధన కోసం మరో పోరాటం"
"నేటి నిఘా న్యూస్" అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా:
హైదరాబాద్. బాగ్ లింగంపల్లి,
సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం తెలంగాణ ఉద్యమ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పితామహులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,
తెలంగాణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను స్మరిస్తూ వారి కుటుంబాలకు అండదండగా ఉండాలని రాష్ట్ర సాధనకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలతో ....
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ బోర్డు సాధన కమిటీ అధ్యక్షులు చీమ శ్రీనివాస్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధికారత సంక్షేమం హక్కులు కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయుటకై తెలంగాణ ఉమ్మడి 10,జిల్లాలు హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, జిల్లాల నుండి 31 ప్రస్తుత కొత్త గా ఏర్పడ్డ అన్ని జిల్లాల నుండి హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు సమీక్ష సమావేశం ఘన సన్మానము కోసం తరలివచ్చిన ఉద్యమకారులను ఉద్దేశించి వారు చేస్తున్న సేవలను త్యాగాల ను స్మరిస్తూ నాటి ఉద్యమ తెలంగాణ నుండి నేటి భవిష్యత్తు తెలంగాణ వరకు జరిగిన ఘటనలు, కేసులు, ధర్నాలు, రాస్తారోకోలు మానవహారాలు గురించి, సంఘటనలపై ప్రత్యక్ష పరోక్ష పోరాటాలు పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకు సరైన గుర్తింపు వారి పోరాటాలకు స్ఫూర్తి గా నిలిచే ప్రతి ఉద్యమకారుని గుర్తించవలసిన అవసరం ఉందని తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు సరైన అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయడానికి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కి డిమాండ్ చేశారు .
తెలంగాణ రాష్ట్ర జేఏసీ, ప్రొఫెసర్ కోదండా రామ్,
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరో పోరాటం చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ పోరాట ఐక్యవేదిక ఇంఛార్జి శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో త్యాగాలను స్మరిస్తూ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
*తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి
*అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారుల డిక్లరేషన్ వెంటనే ప్రకటించాలి
*ఉద్యమకారులకు పెన్షన్లు *వడ్డీ లేని రుణాలు అందించాలి
*తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి గౌరవించాలి
*తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ఆరోగ్య భద్రత కల్పించాలి
*ఉచిత బస్సు రైల్వే సదుపాయం కల్పించాలి
*అన్ని రాజకీయ పార్టీలో తెలంగాణ రాష్ట్ర తగిన ప్రాధాన్యతను గుర్తింపును ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
జార్ఖండ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఉద్యమకారులను ఏవిధంగా చూస్తున్నారో అలాంటి సంక్షేమ పథకాలు హక్కులు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఈసందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఐక్యవేదిక ఉద్యమం కోసం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుండి ఏర్పడ్డ 31 జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారులు భారీ ఎత్తున తరలివచ్చారు
ఈ కార్యక్రమం ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన సమీక్ష సమావేశ కార్యక్రమం లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఐక్యవేదిక సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కు చెందిన ఉద్యమ నాయకులు కలిగొట్ల వెంకటేశ్వర శర్మ అక్బర్ నగర్ గ్రామవాసి ,కి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానము చేసి శాలువా,మేమొంటో తో సత్కరించారు, తెలంగాణ ఉద్యమకారుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో వార్తలను అందిస్తున్న జర్నలిస్టులు గా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లో వార్తలను ప్రభుత్వానికి ప్రజలకు చేరవేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమల్లో రాస్తారోకోలు బందులలో, స్వచ్ఛందంగా పాల్గొంటూ తెలంగాణ హక్కుల సాధన కోసం మేము సైతం అంటూ ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమ వార్తలను అందిస్తూ ప్రత్యక్ష పోరాటాలు , ధర్నాలు రాస్తారోకోలు చేస్తూన్న అది ఆదివాసీ గిరిజన హక్కుల యువజన విభాగం అధ్యక్షులు, కట్టా నరేశ్ కుమార్ నాయక్,ను తెలంగాణ ఉద్యమకారుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానము చేసి శాలువా, మెమొంటోతో సత్కరించారు,తెలంగాణ రాష్ట్ర సంక్షేమ బోర్డు అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఈ సందర్భంగా అభినందించారు, క్షేత్ర స్థాయిలో నరేశ్ కమలపుర్ గ్రామ వాస్తవ్యులు డిచ్ పల్లి మండలం నిజామాబాద్ రూరల్ నియోజవర్గం నిజామాబాద్ జిల్లా లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ హక్కుల పోరాటం చేస్తూ ప్రజల కోసం పోరాడుతున్న ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొంటూ అవినీతి అక్రమాల పై నిత్యం పోరాటం చేస్తూ భవిష్యత్తు తెలంగాణ కోసం పోరాడుతున్నరు తెలంగాణ ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సంక్షేమ బోర్డుసాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్,శంకర్, జనార్ధన్, కలిగుట్ట వెంకటేశ్వర శర్మ, కట్టా నరేశ్ కుమార్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, తిలక్, రాజుకుమర్, రవీందర్, నరేందర్ రెడ్డి, పోచయ్య, లక్ష్మీకాంత్,విజయ శ్రీ, సుజాత,తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment