"కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో"
"కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రచారం"
నేటి నిఘా న్యూస్ ✍️ హైదరాబాద్.
కట్టా నరేశ్ కుమార్ నాయక్ (జర్నలిస్ట్)
*అందుకే హైదరాబాద్ వచ్చా.. నాకు మద్దతివ్వండి: మల్లికార్జున ఖర్గే*
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న *కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే* శనివారం హైదరాబాద్ విచ్చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన మధ్యాహ్నం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. గాంధీభవన్‌లో నిర్వహించిన వీడియా సమావేశఃలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. కొందరిని మాత్రమే బీజేపీ ఐశ్వర్యవంతులను చేస్తోందని మండిపడ్డారు
ఈనెల 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నట్లు ఖర్గే తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నానని, తనకు ఓటేయాలని పీసీసీ సభ్యుల్ని కోరేందుకు హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. 136 ఏళ్లలో నాలుగు సార్లు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయన్నాను. సుభాష్ చంద్రబోస్, కేసరి, సోనియా గాంధీ కోసం ఎన్నికలు జరిగాయన్న ఖర్గే.. ఇప్పుడు అయిదోసారి తాను పోటీలో నిలిచినట్లు పేర్కొన్నారు. చాలా మంది సీనియర్లు తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు.
Comments
Post a Comment