"ఆధునిక బుద్ధుడు"
"ఆధునిక బుద్ధుడు"
*కాన్షిరాం స్మృతికి జై జైలు*
నేటి నిఘా న్యూస్:
భారత దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అనంతరం బహుజనుల పాలిట మహోన్నతమైన రాజకీయ దురంధురుడు మాన్యవార్ కాన్షిరాం గారు. ముఖ్యంగా ఎస్సి, ఎస్టి, ఓ/బీసీ, మైనార్టీ ప్రజల్లో తమ అమూల్యమైన ఓటు విలువను, రాజ్యాధికార ఆకాంక్షను నూరిపోసిన నిజమైన రాజకీయవేత్త. సమాజంలోని ప్రతి కులాన్ని బహుజనకరిస్తూ "మన అత్యధిక ఓట్లతో మనమే పాలకులం" కావాలని చెప్పాడమే గాకుండా ఆచరణలో సాధించిన మహానాయక్. యూపీలో అధికారం కైవసం చేసుకున్న అనంతరం "జో జమీన్ సర్కారీ హై - హో జమీన్ హమారి హై" అనే నినాదంతో 85 లక్షల ఎకరాల భూమిని బహుజన శ్రామికులకు కులధమషాగా పంపిణి చేసిన గొప్ప రైతు నాయకుడు. ఆరంభం నుంచి నిర్వాణం పొందేవరకు అహంకారం లేమి, సోకులు లేమి, అవినీతి ఆరోపణలు లేని, సాదాసీదా ఉత్తమ ఉద్యమ జీవనం గడిపిన ఆధునిక బుద్ధుడు కాన్షిరాం అంటూ సమితి అధ్యక్షులు గోవింద్ సగ్యలల్లు ఆయన త్యాగశీలి జీవితాన్ని వివరించారు. ఆదివారం మధ్యాహ్నం భారతీయ సమాజ్ సేవ సమితి మాదిగ (రిజి) ఆధ్వర్యంలో మాన్యవార్ కాన్షిరాం 16వ. వర్దంతి సభను పశ్చిమ వడాలలోని తెలుగు భవన్లో నిర్వహించారు. ఇందులో "సమితి" సహాయ కోశాధికారి బాబు మాత్రే, ఆడిటర్ శివప్ప ప్యాట, గణేష్ మాలక్, ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నేత వడ్డి సూర్యునారాయణ, బల్ల సత్యనారాయణ, నెలపూడి శరత్, బాబు, సంటి శంకర్ మహారాజ్, గాయకులు భీంరత్న మాలజీ, మూల్ నివాసి మాలజీ తోపాటు బాండిల్కి నాయకులు ప్రమోద్ సావంత్, కమల్కార్ షిందే, రూపేష్ పురాల్కర్ తదితర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో బహుజన నాయకులు, సీనియర్ నాయకులు రాములు తదితరులు కాన్సిరాం సేవలను కొనియాడారు
Comments
Post a Comment