*"ఆదివాసి నాయక్ పోర్ట్ గిరిజన సేవ సంఘం ఆధ్వర్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయం*"
"ఆదివాసీ నాయకుడు గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం"
కట్టా నరేశ్ కుమార్ నాయక్ (జర్నలిస్ట్)
నిజామాబాద్ జిల్లా. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో రామచంద్ర పల్లి గ్రామంలో ఆదివాసి నాయకుడు గ్రీన్ సేవా సంఘం ఆధ్వర్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సభ్యులు .
జై భీమన్న జై జై భీమన్న!!
మాక్లూర్ మండలం రామచంద్ర పల్లి గ్రామంలో గత మూడు నెలల క్రితం మన నాయకపోడు కులానికి చెందిన దుడ్డిండ్ల పోశెట్టి అనే వ్యక్తిని రామచంద్ర పల్లి శివారులో అతి దారుణంగా హత్య చేసి చంపడం జరిగింది. 10-10-2022 రోజున మన జిల్లా కోశాధికారి మరియు రామచంద్ర పల్లి గ్రామ నివాసి మహేష్ జిల్లా కలెక్టర్ గారికి బాధిత కుటుంబాన్ని తీసుకెళ్లి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి జిల్లా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది జిల్లా కమిషనర్ గారు బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది.ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన పోశెట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈరోజు మన జిల్లా యువజన నాయకులు అందరు కలిసి బాధితుని కుటుంబానికి సహాయాన్ని అందించడం జరిగింది.జిల్లా అధ్యక్షులు గడ్డం శంకర్ జిల్లా కోశాధికారి సురేష్ రాజేందర్ సహకారంతో ఈరోజు రామచంద్రపల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారిని ఓదార్చి నిందితులను శిక్షించే వరకు కుటుంబానికి అండగా ఉంటామని వారికి ధీమా ఇవ్వడం జరిగింది. కుటుంబానికి ఆర్థిక సహాయంగా 15000/- రూపాయలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి గడ్డం సాగర్. న్యాయ సలహాదారులు గోపి సాయన్న . ఖానాపూర్ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్. బర్లపటి గ్రామ సర్పంచ్ శ్రీను. దుండిగాల్ల రవికుమార్ .పొలిటికల్ ఆర్మూర్ నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి మిర్దపల్లీ నారాయణ. పొలిటికల్ కో కన్వీనర్ రటం అరుణ్. నందిపెట్ మాజీ మండల అధ్యక్షులు బొంత సురేష్. ఆర్మూర్ మండల అధ్యక్షులు వాసర నరేష్. నందిపేట్ మండల యూత్ ప్రధానకార్యదర్శి మెట్టు పోశెట్టి. నవిపెట్ మండల యూత్ అధ్యక్షులు మేకల సాయిరాం. సొసైటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. రామచంద్రపల్లి తౌడు మహేష్. రాటం సాయికుమార్. రిపోర్టర్ నరేష్. చేపూరి శ్రీకాంత్.మయపూర్ సంతోష్. రాజు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment