"ఆన్లైన్ సైబర్ మోసాలపై ఫిర్యాయదు చేయండి.1930📲"

ఆన్లైన్ సైబర్  మోసాలపై జాగ్రత్త !
వెంటనే ఫిర్యాదు చేయండి 
నేటి నిఘా న్యూస్:
అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్.
పోలీస్ కమిషనర్ కార్యాలయం
 నిజామాబాద్
తేది:- 05-11-2022 
*టోల్ ఫ్రీ నెంబర్లు 1930*
*ఆన్లైన్ మోసాల వలలో ప్రజలు.... అప్రమత్తంగా ఉండటమే మేలు: సైబర్ క్రైమ్ పోలీస్ వారి విజ్ఞప్తి ఆశపడితే మోసపోతారు.... సత్వరమే పోలీసులకు ఫిర్యాదు చేస్తే రికవరీకి ఛాన్స్*

  🔹 కమిషనరేట్ పరిధిలో ఈ వారంలొ అధికంగా ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, లలొ అమేజాన్, ఫ్లిప్కార్ట్ ల పార్ట్ టైమ్ ఉద్యోగం పేర్లతో మరియు పెట్టుబడికి అధిక లాబాలు వస్తాయి అని వచ్చే మెసేజ్ లను నమ్మి మోసాలు జరిగాయి.

 🔹SBI YONO, మరియు KYC. PAN కార్డు అప్డేట్ పేరుతో మోసాలు జరిగాయి.

 🔹సైబర్ నెరగాళ్లు ఫేస్ బుక్ లేదా ఇతర సామాజిక మధ్యమాలలో మీ స్నేహితుల / బంధువుల పేర్లతో అకౌంటు క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు.

🔹కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేయకండి, సంబంధిత యాప్ ల లోనే నెంబర్ ఉంటుంది. 
 🔹ANY DESK అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమని అడిగితే అస్సలు చేసుకోకండి.

 🔹1930 కి కాల్ లేదా NCRP portal https://cybercrime.gov.in లో పిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, తక్షణమే కాల్ చేయండి.

    ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. మాయమాటలు చెప్పి అకౌంట్లో డబ్బులు మాయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్నేహితులు/బంధువుల పేర్ల పై అకౌంట్ క్రియేట్ చేసి అత్యవసరంగా డబ్బులు సాయం కావాలని, మరియు లక్షలు కోట్ల వస్తాయి. ముందుగా కొంత డబ్బు పెట్టుబడి పెట్టాలని మోసం చేయడం, తక్కువ ధరలకే వాహనాలు అని టెలిగ్రాం ఫేస్ బుక్, olx, వస్తువులు అని మోసం చేయడం వారి మాటలు నమ్మి మోసపోయిన అమాయకుల అకౌంట్ లలో నుండి డబ్బులు కాజేయడం చేస్తున్నారు. సైబర్ నేరాలను నివారించాలని ఉద్దేశంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గురించి అవగాహన కల్పించేందుకు , నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని జిల్లా పోలీసు అధికారులు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలొ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్, పాంప్లెంట్ ,పేపర్ ప్రకటనలు, సోషల్ మీడియా, కళాబృందాల ద్వారా, గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అవగాహన కల్పించాలని *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ K.R. నాగరాజు, ఐ.పి.ఎస్*. గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

*నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ ఆయిన కొన్ని కేసుల వివరాలు*

  🔹మెండోరా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడి తన యొక్క స్నేహితుని పేరుతో ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ క్రియేట్ చేసుకున్న సైబర్ నేరగాడు. తాను హాస్పిటల్లో ఉన్నానని అర్జెంటుగా డబ్బులు కావాలని అడగగా, ఫోన్ పే ద్వారా 8200/ రూపాయీలు పంపించాడు. మరలా ఇంకొన్ని డబ్బులు కావాలి అని అడగగా అసలు సమస్య ఏమిటో తెలుసుకుందామని బాధితుడు తన స్నేహితుడికి కాల్ చేయగా, నేను ఏ డబ్బులు అడగలేదు అది నకిలీ మెసేజ్ అని చెప్పాగా మోసపోయాను అని గ్రహించి, cybercrime,పోర్టెల్ కి రిపోర్ట్ చేయడం జరిగింది.....

🔹ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితునికి మీ SBI YONO app లో PAN CARD (KYC) డీటెయిల్స్ అప్డేట్ చేయండి లేకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుంది అని మెసేజ్ వచ్చింది. బాధితులు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి YONO యొక్క యూజర్ name & password ఎంటర్ చేశాడు. ఆ తరువాత తాను రిసీవ్ చేసుకున్న OTP లు కూడా ఎంటర్ చేశాడు, వెంటనే బాధితుడు ఎకౌంట్ నుంచి Rs. 6,100/- రూపాయిలు పోయాయి. ఇలాగానే 6వ టౌన్ బాదితుడు49990 /-, నాలుగో టౌన్ బాదితుడు 25000/-, మాక్లూర్ బాదితుడు 20,907/- 5వ టౌన్ బాదితుడు 23948/-. జక్రాన్ పల్లి బాధితుడు 18852/- పోగొట్టుకున్నారు.

🔹ఒక పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితునికి facebook ద్వారా సైబర్ నేరగాడు ఒక యువతిలా పరిచయం చేసుకొని whats App నెంబర్ ను తీసుకొని అశ్లీల వీడియో ఫోన్ ముందు పెట్టి వీడియో కాల్ చేసి మాటలాడుతూ స్క్రీన్ రికార్డ్ చేసి, YouTube లొ పెడుతా అనిభయ పెట్టి డబ్బులు వసూలు చేసి మోసంచేయడం జరిగింది. Facebook లొ అపరిచీతుల మాటలు నమ్మకండి.. ఫ్రెండ్స్ గా చేర్చుకోకండి whats app నంబర్స్ ఇవ్వకండి.

🔹డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు ఒక ఆన్-లైన్ లొ జాబ్ సర్చ్ చేయగా ఒక సైబర్ నేరగాడు ఫోన్ చేసి మీకు ఎయిర్పోర్ట్ లొ జాబ్ యిస్తాము అని చెప్పి మీరు కొంత పేమెంట్ చేయాలి అని చెప్పి 23500/ వివిధ కారణాలు చెప్పి పలు దఫాలుగా డబ్బులు వేయించుకొని మోసం చేశాడు..

🔹ఆర్మూర్ మరియు 4 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన బాధితులు గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి కాల్ చేశాడు. ఆ నెంబర్ సైబర్ నేరగాడి నెంబర్. సైబర్ నేరగాడు బాధితులతో మీ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ANY DESK అప్లికేషన్ డౌన్ లోడ్ చేయమని చెప్పగా బాధితుడు  డౌన్ లోడ్ చేసి తొమ్మిది అంకెల యాక్సిస్ ఐడి ని సైబర్ నేరగాడి కి ఇచ్చారు. ఆ తరువాత బాధితులు తమ ఆన్-లైన్ బ్యాంకింగ్ కూడా ఓపెన్ చేసారు. ANY DESK అప్లికేషన్ ద్వారా బాధితుల యొక్క ఆన్-లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడి & పాస్వర్డ్ తెలుసుకున్న సైబర్ నేరగాడు బాధితుల అకౌంట్ నుంచి 43431/-, 18005/- వేలు కొట్టేశాడు.

 🔹ఎర్గట్ల, ఇందలవాయి, ఆర్మూర్, డిచ్పల్లి, భీంగల్ మరియు నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లలోని బాధితులు పార్ట్ టైం జాబ్ గురించి ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ మరియు కొన్ని సామాజిక మాధ్య మాలలొ ప్రకటనలు చూసి ,కాల్స్ మెసేజెస్ లు చేసి, సైబర్ నేరగాడుపంపిన మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి తమ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకున్నా రు. సైబర్ నేరగాడు, బాధితులతో మేము మీకు ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ ని క్లిక్ చేశాక అందులో ఉన్న వస్తువులను ముందు మీరు మీ డబ్బుతో కొనాలి. ఆ తరువాత కమిషన్ తో కలిపి మీ డబ్బు మీకు రిటన్ చేస్తాము  అని చెప్పారు. అది నమ్మిన బాధితులు ముందు చిన్న మొత్తాలతో వస్తువులు కొనగా, కమిషన్ తోపాటు రిటన్ చేశారు. పూర్తిగా నమ్మిన బాధితులు 9 మంది 4 లక్షలు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోస పోయారు .
సైబర్ నేరగాళ్లు బాధితులు కి ఇంస్టాగ్రామ్ ,ఫేస్ బుక్, మరియు కొన్ని సామాజిక మాధ్య మాలలొ ,వలలు విసురుతున్నారు జాగ్రత.

🔹5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు Credit Park, అనే లోన్ అప్లికేషన్ లో లోన్ తీసుకుని తిరిగి చెల్లించాడు. అయినప్పటికిని మరలా కాల్ చేసి మీరు లోన్ పే చెయ్యలేదు మళ్ళీపే చేయండి లేకపోతే మీ బంధువులకి ఫోన్ చేస్తాము, ఫోటోస్ పెడతము, అంటూ బయపెడుతున్నారు. తక్షణ రుణాలు అని ఎవరైనా whats app కాల్/మెసేజ్ చేస్తే నమ్మకండి. గుర్తింపు లేని ఎటువంటి లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకండి , వాటల్ల లో లోన్లు తీసుకోకండి, బాధపడకండి. ఇలాగే Buddy Cash లోన్ app నుండి లోన్ తీసుకొని బాధ పడుతునట్లు 4వ, టౌన్ డిచ్పల్లి మరియు నిజామాబాద్ రూరల్ టౌన్ బాధితులు ఫిర్యాదు చేశారు.
 
*తీసుకోవలసిన జాగ్రత్తలు*:

 🔹 *ఆన్ లైన్ ద్వారా జాబ్ లు / లోన్ లు ఇస్తున్నామని వచ్చే మెసేజ్ / link ల ప్రకటనలు నమ్మి డబ్బులు పంపించి మోసపోరాదు. జాబ్ లు ఇచ్చే కంపెనీ లు ఎవరిని కూడా ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపించమని అడగరు. అత్యాశకు పోయి అపరిచిత వ్యక్తులకు ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపించి మోసపోరాదు*.

 🔹 *సోషల్ మీడియాలో వచ్చే మోసపూరిత ప్రకటనలను నమ్మి ఎటువంటి వస్తువులను కొనుగోలు చేయరాదు. డబ్బులు పెట్టుబడి పెట్టరాదు*.

 🔹 *Fake కాల్స్ కి స్పందించ రాదు. గుర్తుతెలియని వ్యక్తులు అదేపనిగా ఫోన్ చేస్తే ఫిర్యాదు చేయాలి*.

  🔹 *ఏ బ్యాంకు కూడా KYC అప్డేట్ చేయమని SMS ద్వారా లింక్ లను పంపవని గుర్తించండి*.

 🔹 *ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ Whatsapp DP (Display Picture) లలొ ఫ్రెండ్స్ Officers ఫోటోస్ చూసి మోసపోవద్దు*. 

🔹 *ఫోన్ పే & గూగుల్ పే లాంటి wallet / gateway ల ద్వారా కొత్త వ్యక్తులకు డబ్బులు పంపించే ముందు ఫోన్ చేసి నిర్ధారణ చేసుకొని జాగ్రత్త పడాలి*.

 🔹 *ఈ కామర్స్ & ఈ బిజినెస్ సైట్ నమ్మదగిన ప్రముఖమైన వాటిలలో నే కొనుగోలు చేస్తే మన డబ్బుకు గ్యారంటీ ఉంటుంది*.

 🔹 *ఫోన్ లో వివిధ రూపాల్లో వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదు*.

   *ఏదైనా సైబర్ నేరము జరిగిన వెంటనే లేక 24 గంటల లోపు 1930 కి కాల్ చేయడమో లేదా National Cyber crime Reporting Portal ఐన https://cybercrime.gov.in లో పిర్యాదు నమోదు చేస్తే పోయిన సొమ్ము తిరిగి వచ్చే అవకాశము కలదు*.

నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
యడ్స్ & న్యూస్:
✍️ఎడిటర్.
కట్టా నరేశ్ కుమార్ నాయక్
 జర్నలిస్ట్ 📲7097988840.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026