"బైకుల దొంగ అరెస్ట్"
"బైకుల దొంగ అరెస్ట్"
*పోలీస్ స్టేషన్:-* నిజామాబాద్ రురల్ పి. ఎస్. నిజామాబాద్.
*Crime Number:-* 381/2022 U/s 379 IPC
*విచారణ అధికారి పేరు:-*
జి. లింబాద్రి- SIP, నిజామాబాద్ రురల్ పి. యస్. నిజామాబాద్.
*పిర్యాది దారుని వివరాలు:-*
శ్రీ. నాశెట్టి సాయి కుమార్, S/o సంజీవ్, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు, Occ: కారు డ్రైవర్, R/o ఆకుల కొండూరు, నిజామాబాద్,
*నేరస్తుల వివరాలు:-*
A1. సూర్యవంశీ సాయి కుమార్ S/o సూర్యవంశీ రమేష్, వ: 21 సం.లు , కులం: ఆరె మరాఠా, వృత్తి: కూలి, R/o H.No. 6 -22 -542 , గౌతమ్ నగర్, నిజామాబాదు.
A2. శ్రవణ్ NGOs కాలనీ, నిజామాబాదు.( పరారీ లో వున్నాడు)
*నేరస్తుల నుంచి స్వాదీనం చేసుకున్న సొత్తు:-* ఏడు మోటార్ సైకిళ్ళు అవి 1) గ్లామర్ మోటార్‌సైకిల్ నంబర్. TS16EV 9010 2) గ్లామర్ మోటార్‌సైకిల్ నంబర్. TS16EN5054, 3) పల్సర్ No. TS16FA9214, 4) Splender No. TS16ET0458, 5) Splender No. AP25AH3898, 6) రాయల్ ఎన్‌ఫీల్డ్ నంబర్. TS-17-6786, 7) Splender No. TS16EL9630 ( వీటి విలువ సుమారు రూ 4,50,000/- )
*అరెస్టు చేసిన తేదీ మరియు స్థలము:-* తేది:09.11.2022 ఖానాపూర్ బైపాస్ చౌరస్తా , నిజామాబాద్
*కేసు యెక్క వివరాలు :*
ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికీ తెలియజేయునది ఏమనగా, ఈరోజు రూరల్ పిఎస్ ఎస్ఐ గారితో పాటు సిబ్బంది ఈరోజు ఖానాపూర్ బైపాస్ చౌరస్తా , నిజామాబాద్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఒక బండిపై వస్తుండగ ఆపి అతన్ని చెక్ చేస్తుండగా అతను పారిపోయే ప్రయత్నం చేసినాడు అప్పుడు పోలీస్ వారు అతన్ని పట్టుకొని విచారించగా వారు తన పేరు 1) సూర్యవంశీ సాయికుమార్, శ్రవణ్ NGOs కాలనీ వ్యక్తితో కలసి తను చేసిన నేరాలను చెప్పినాడు
అవి ఏమనగా 1) తేదీ 23.10.2022 నాడు ఘనపూర్ గ్రామం లో రాత్రి సమయంలో ఒక గ్లామర్ బైకును దొంగతనం చేసినారు . 2) తేదీ 24.10.2022 నాడు SVR కాలేజ్ డిచ్పల్లి నందు గ్లామర్ బైక్ ను దొంగలించినారు. 3) తేదీ 28.10.2022 నాడు పల్సర్ బండిని ఆకుల కొండూరు నందు దొంగలించినారు. 4) తేదీ 31.10.2022 రోజున ఆఛాన్పల్లి బోధన్ నందు స్ప్లీన్డెర్ మోటర్ సైకిల్ ను దొంగతనం చేసినారు, 5). తేదీ 02 .11 .2022 నాడు పాత రాజాంపెట్, దేవన్పల్లి నందు హీరో స్ప్లీన్డెర్ మోటార్ సైకిల్ను దొంగతనం చేసినారు, 6) 02.11.2022 నాడు హోసింగ్ బోర్డు కాలనీ, కామారెడ్డి రాయల్ ఎంఫిల్డ్ నందు దొంగతనం చేసినారు, 7 ) తేదీ 03.11.2022 నాడు పడకల గ్రామం, జక్రాన్పల్లి నందు ఒక స్పీలేందర్ బండిని దొంగతనం చేసినారు. అట్టి దొంగతనం చేసిన మోటర్ సైకిల్లను అన్నింటిని గౌడ్స్ కాలనీ లారి పార్కింగ్ లో ఉంచి సమయం దొరికినప్పుడల్లా అమ్మకుందామని
అనుకున్నారు. ఆ విధంగా ఈరోజు ఆకుల కొండూరు నందు దొంగలించిన పుల్సార్ బండిని డిచ్పల్లి ఏరియాలో
అమ్ముకుందామని వెళ్తుండగా ఖానాపూర్ బైపాస్ నందు వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్ పోలీస్ సిబ్బంది అతని పట్టుకోవడం జరిగింది. ఇట్టి కేసు చదనలో పాల్గొన్న, సౌత్ రురల్ సర్కిల్ సి.ఐ జె. నరేష్ గారు, టాస్క్ ఫోర్స్ ACP కిరణ్ గారి ఆద్వర్యంలోని CIs శ్రీధర్, వెంకటేష్ లను, రురల్ యస్.ఐ G.లింబాద్రి గారు, మరియు రురల్ పి. ఎస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని నిజామాబాదు సీపీ నాగరాజు గారు అభినందించారు. ఇట్టి వ్యక్తిని జ్యూడిషల్ రిమాండు కు పంపుచున్నాము.
ఈ రోజు ఈ కార్యక్రమంలో గౌరవ నిజామాబాదు సీపీ నాగరాజు నిజామాబాదు ACP వెంకటేశ్వర్ గారు, టాస్క్ ఫోర్స్ ACP శ్రీ. M. కిరణ్ . సౌత్ రురల్ సర్కిల్ సి.ఐ. జె.నరేష్ , టాస్క్ ఫోర్స్ CIP శ్రీధర్, వెంకటేష్, వారి సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , రూరల్ పోలీసు స్టేషన్ యస్.ఐ G.లింబాద్రి మరియు పి. ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment