*కాళోజీ ఆశయాల కై ఉద్యమిద్దాం*

 *కాళోజి ఆశయాలకై ఉద్యమిద్దాం..!*
*-పిడిఎస్యు జిల్లా కన్వీనర్ బానోత్ దేవేందర్*

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో కాళోజి నారాయణరావు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని పిడిఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కాలేజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా కన్వీనర్ బానోత్ దేవేందర్ మాట్లాడుతూ....  రాజకీయ సాంఘిక చైతన్యల సమాహారం కవిత్వం రాసిన ప్రజా కవి కాళోజి హక్కులు అడిగిన ప్రజల మనిషి, ఉద్యమం నడిపిన ప్రజావాది మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీల కాళోజి పుట్టుక చావు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు వైతాళికుడు కాళోజి అని అన్నారు. నిజం దమన నీతికి నిరంకుశత్వానికి ఆచారక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తారు. కాళోజి  స్వాతంత్ర సమరయోధుడు 1992లో భారత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు పొందారు.  ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుండి 1960 వరకు పనిచేశారు. ఆంధ్ర  సరస్వత పరిషత్ వ్యవస్థ పక సభ్యుడు సభ్యుడుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడుగా తను తెలంగాణ రచయితల  సంఘం అధ్యక్షునిగా 1957-61 కాలంలో గ్లోరీ కమిటీ సభ్యునిగాను ఉన్నారు. కాలోజీ మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో పండితుడుగా ఎన్నో ఇతర భాషల గ్రంథాలను తెలుగులోకి అనువదించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. 1939 హైదరాబాదులో ఉన్నత న్యాయస్థానానికి అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాలల నుంచి న్యాయశాస్త్రంలో పట్ట పొందారు. 1930 నుంచే కాళోజి గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామాలలో ఒక్కొక్క గ్రంథాలయం ఉండాలనేదే కాలోజీ ఆకాంక్ష   సత్యగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులోనే జైలు శిక్ష అనుభవించిన గొప్ప వ్యక్తి కాళోజి అని అన్నారు. నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939 ల, 1943 ల రెండుసార్లు జైలుకి పోవాల్సివచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలనీ అన్నాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నాడు. ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణలలో కాళోజి భాగం ఉంది. పి.వి. నరసింహారావు లాంటి ఎందరికో అతను సాహిత్యంల, రాజకీయాల్లో మార్గదర్శనం చేశాడు.
విశాలాంధ్ర సమస్యలు గమనించి అతను 1969 ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశాడు. అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించాడు. కాళోజి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ ప్రతిమ పూనాలని ఈ ప్రజావ్యతిరేక పాలనపై రాజులేని పోరాటాలు నిర్వహించాలని అప్పుడే కాలోజీ నారాయణరావు గారికి మనమిచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దిలీప్, వీరన్న, సాయి, ప్రవీణ్, సిద్దు, గణేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026