*పోలీస్ స్టేషన్ తనిఖీ*

*పోలీస్ స్టేషన్ తనిఖీ*
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా.
న్యూస్ లైన్ ప్రతినిధి ✍️క్రైమ్ నిజామాబాద్. 
 (కట్టా నరేశ్ కుమార్ నాయక్ ,జర్నలిస్ట్)
పోలీస్ కమీషనర్ కార్యాలయం
నిజామాబాద్:- (22-11-2022)
 *వార్షిక తనిఖీలలో భాగంగా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీలు నిర్వహించిన ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్, హైదరాబాద్*
 *ఉదయం 10:30 గంటలకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్ను " వార్షిక తనిఖీలలో " భాగంగా  ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ హైదరాబాద్, గౌరవనీయులు శ్రీ వి.ఆర్. కమలహాసన్ రెడ్డి, ఐ.పి.యస్.,  క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది*.

 *మొట్టమొదలు గౌవర వందనం స్వీకరించారు. మరియు డిచ్పిల్లి పోలీస్ స్టేషన్ యందు మొక్కలు నటీనారు* .
 *అనంతరం డిచ్ పల్లి సర్కిల్ కార్యాలయం ను వీక్షించి*,
*ఫ్యామిలి కౌన్సిలింగ్ సెంటర్* 
పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించారు.
 *తదుపరి డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లోని*

 🔹  రిసిప్షన్ సెంటర్ సిబ్బందితో మాట్లాడారు, ఫిర్యాదు దారులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు  అడిగి తెలుసుకున్నారు.
 🔹  స్టేషన్ రైటర్ రికార్డులు మరియు వారి పనితీరు చూశారు.
 🔹 5S విధానం పనితీరు
 🔹  బెల్లఫామ్, స్టోర్రూమ్, రెస్ట్ రూమ్, సిబ్బంది గదులు చూసారు.
 🔹  కోర్టు డ్యూటీ రికార్డులు,
🔹  హెచ్.ఆర్.ఎమ్.ఎస్(HRMS) విధానం అమలు జరుగుతుందో లేదో చూశారు.
🔹 సి.సి.టి.న్.ఎస్ (CCTNS) పని చేస్తున్న విధానం, వాటి రికార్డులు చూశారు.
 🔹 పోలీస్ స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది.
 రికార్డుల పరిశీలన తర్వాత సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు, వారి సాదకబాదలు అడిగి తెలుసుకున్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
*ఈ సందర్భంగా చక్కగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు*.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ *పోలీస్ కమీషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్*.,, *డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. అరవింద్ బాబు*, నిజామాబాద్ ఎ.సి.పి శ్రీ ఎ.వెంకటేశ్వర్ రావు, డిచ్పల్లి సి.ఐ శ్రీ డి.మోహన్, డిచ్పల్లి ఎస్.ఐ శ్రీ కె. గణేష్, శ్రీ బి. మనోజ్ కుమార్, జక్రాన్ పల్లి ఎస్.ఐ శ్రీ శ్రీకాంత్, ఇందల్వాయి ఎస్.ఐ శ్రీ నరేష్, ఆఫీస్ సూపరింటెండెంటు శ్రీ శంకర్, సి.సి.ఆర్. బి ఎస్.ఐ శ్రీ చాందయ్య మరియు సిబ్బంది హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026