"ప్రధాని మోడీ పర్యటన"
"మోడీ స్వాగత సభ బేగంపేట్"
"మోడీ స్వాగత సభ"నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
హైదరాబాద్.
*బేగం పేట ఎయిర్ పోర్ట్*
బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ముగిసిన మోడీ స్వాగత సభ
*30 నిమిషాల పాటు సభలో మాట్లాడిన మోడీ*
**ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్**
►భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం
►తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది
►తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు
►తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను
►మీరు ఒక యుద్ధం చేస్తున్నారు..ఒక పోరాటం చేస్తున్నారు
►తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు
►తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది
►తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది
►తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు
►తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు
►ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది
►బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది
►మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం
►గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది
►కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు
►1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు.. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు
►హైదరాబాద్ ఇన్ఫరేషన్ టెక్నాలజీకి కోట లాంటింది
►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది
►తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం
►కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు
►బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
*కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పీచ్*
►తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు
►ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు
►దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు
►సీఎం కేసీఆర్‌ది నిజాం రాజ్యాంగం
►సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది
►తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు
►తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది
►రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంది
► షెడ్యూల్ కంటే ముందుగానే ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ బయట బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ. కార్యక్రమంలో వేదికపై మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్, డాక్టర్ లక్ష్మణ్, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముడు-మోదీతో కూడిన ఓ చిత్రపటాన్ని ప్రధాని మోదీకి బహూకరించిన బీజేపీ శ్రేణులు.
బేగం పేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో
రామగుండం బయల్దేరిన ప్రధాన మంత్రి మోడీ.
Comments
Post a Comment