"పరిసరాల పరిశుభ్రత"
పాలిటెక్నిక్ కళాశాలలో క్లీన్ ఇండియా కార్యక్రమం
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా.
నేటి నిఘా న్యూస్:
నిజామాబాద్ జిల్లాలోని.
క్లీన్ ఇండియా 2022 లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థులు,అధ్యాపకులు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు గంటపాటు మైదానంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం కష్టతరమే అయినా కనీసం మనం వాడుతున్న ప్లాస్టిక్ ను సరైన చోట వేయగలిగితే అది రీసైక్లింగ్ కి వినియోగించవచ్చని తెలిపారు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అస్సలు వాడవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు గంగా ప్రసాద్,స్వచ్ఛంద సేవకుడు లింబద్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment