"సిపీ ఆఫీస్ లో ఆత్మహత్యాయత్నం"


*పోలీస్ కమిషనర్ కార్యాలయంలో "అన్నదమ్ముల ఆత్మహత్య యత్నం"
నేటి నిఘా న్యూస్:
అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్.
(న్యూస్ లైన్ ప్రతినిధి) నందిపెట్ కు చెందిన అన్నదములు భూమి వివాదం లో
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇద్దరూ అన్నదమ్ముల ఆత్మ హత్యాయత్నం చేశారు పోలీస్ కమిషనర్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఇద్దరు అన్నదమ్ములు డీజిల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు, మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది, నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామానికి చెందిన లక్కంపల్లి హనుమాన్లు లింగం కు చెందిన వ్యవసాయ భూమిని గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి భూమి కబ్జా చేస్తుండని ఆరోపించారు, మూడు సంవత్సరాలుగా నిధులను నిర్వర్తిస్తున్న గ్రామ  సర్పంచ్ మరికొందరు గ్రామస్తులు కలిసి వారు రెండు ఎకరాల భూమిని కబ్జా చేసి అక్కడ వైకుంఠధామాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు, ఈ విషయంలో అన్నదమ్ముల కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినట్లు వారు ఆరోపించారు, మంగళవారం సిహెచ్ కొండూరు గ్రామంలో వారు వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా గొడవ జరిగిందని తెలిపారు, ఈ విషయంలో హనుమాన్లు లింగములను అందరి సమక్షంలో చితకబాదారు ఈ విషయంలో ఇదివరకే నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని కమిషనర్ కార్యాలయానికి కుటుంబ సమేతంగా తరలివచ్చారు అక్కడే ఆత్మహత్య ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని పంచాయితీ కమిషనర్ దగ్గరకు తీసుకెళ్లారు ఈ విషయాన్ని ఆర్మూర్ ఏసీపీతో చర్చించి న్యాయము చేయాలని ఆదేశించారు, ఇద్దరు అన్నదమ్ములతో పాటు వారి కుటుంబ సభ్యులను స్థానిక పోలీస్ స్టేషన్ కు
తరలించారు
బాధితులకు న్యాయం జరిగేనా? 
భూ సమస్యలు పరిష్కారంం ఎప్పుడు సార్ కలెక్టర్, పంచాయతీ అధికారుల చుట్టూ 
కార్యాలయం చుట్టు కళ్ళు అరిగేలా ఎలా తిరిగిన కనికరం లేని అధికారులు చివరకు ఆత్మ చేసుకునే వరకు పట్టించుకోరని సీపీ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్యాయత్నం   చేశారని భావించిన బాధితులు 
ఇకనైనా సమస్య పరిష్కరిస్తారని వేడుకుంటున్న బాధితులు అధికారులు ఏం చేస్తారు ఎదురుచూస్తున్న బాధితులు 
నేటి నిఘా న్యూస్
మీడియా గ్రూప్ 
ఎడిటర్ 
కట్టా నరేశ్ కుమార్ నాయక్
📲7097988840 .

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026