"మొరం మాఫియా జర్నలిస్ట్ పై దాడి"

*జర్నలిస్టు దాడి పై ఫిర్యాదు*
  *విలేకరులపై దాడి చేసిన రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి*

*బాధితులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఎస్సైకి వినతి పత్రం అందజేత*

 కామారెడ్డి 08 నవంబర్:  కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో విలేకరులపై దాడి చేసి బండిని ధ్వంసం చేసి, వారి సెల్ ఫోన్, నగదు వెయ్యి రూపాయలు, ఐడి కార్డు   తీసుకొని వారిని ఇష్టమొచ్చినట్టు బూతులు తిడుతూ  కొట్టి, చంపేస్తామని భయభ్రాంతులను గురి చేసిన రైస్ మిల్  యజమానులు ఎర్ర శ్రీనివాస్, ఎర్ర కాశీనాథ్ వివరాలకు వెళ్తే   విలేకరులు అయినా దేవుళ్ళ రాములు బల్ల వెంకటేష్ , కామారెడ్డి నుంచి దోమకొండ కు వచ్చే మార్గంలో  మొరం టాక్టర్లు  అడ్డు రావడంతో వారు ఆపిన  ఆపకపోవడం ద్వారా, ఎమ్మార్వో కు ఫోన్ చేసి, మొరము ట్రాక్టర్లు వెళ్లే చోటుకు వెళ్లగా  అక్కడ ఎర్ర శ్రీనివాస్, ఎర్ర కాశీనాథ్, నీ మేము అడగగా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు   కొట్టుతూ తన్నుతూ, అసభ్య పదజాలంతో, కులం పేరుతో   దూషించడం, చంపుతామని బెదిరించడం జరిగింది. దేవుళ్ళ రాములు నీ భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ట్రీట్మెంట్ తీసుకొని  నేరుగా పోలీసులు స్టేషన్ కు  ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ లు పోలీస్ స్టేషన్లో ఎస్సై కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ సమాచార కార్యకర్త రవి నాయక్ జర్నలిస్ట్ స్థానిక దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కావున బాధితులకు రక్షణ కల్పించి బాధ్యులపై కేసు నమోదు చేసి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026