"గ్రంథాలయం కబ్జా"
గ్రంథాలయం కబ్జాపై చర్యలేవి?
నేటి నిఘా న్యూస్: నిజామాబాద్ జిల్లా.2000 సంవత్సరంలో గ్రంథాలయం పేరుపై తీర్మానం అయి, స్వాధీనమైన స్థలం, ఇతర వ్యక్తుల పేరుపై ఎలా అయింది? గ్రంథాలయ స్థల కబ్జాదారుని పేరుపై ఓనర్షిప్ సర్టిఫికెట్ ఎలా వెళ్ళింది? ఎవరు ఇచ్చారు?
ప్రస్తుతం కబ్జాదారుడుగా ఉన్న వ్యక్తి 2000 సంవత్సరంలో వార్డ్ మెంబర్ గా ఉండి ఆమోదించి తీర్మానంలో భాగస్తుడు అయినప్పుడు,,,,
సదురు కబ్జాదారుడి పేరుపై ఓనర్ షిప్ ధ్రువపత్రం ఎలా వచ్చింది,,,
గతంలో వార్డ్ మెంబర్ ఉండి తీర్మానంలో భాగస్తుడైన ప్రస్తుతం కబ్జాదారుడైన వ్యక్తిపై ఓనర్ షిప్ సర్టిఫికెట్ ఇవ్వడంలో ప్రధాన పాత్రధారులు సూత్రధారులు ఎవరు?
2000 సంవత్సరం అనంతరం ఉన్న సర్పంచులు ఇచ్చారా? లేక పంచాయతీ అధికారులు ఇచ్చారా? ఈ తప్పిదం ఎవరిది ?ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం వెనుక అంతర్యం ఏమిటి? ఎందుకు ఇచ్చారు? పైసా లాలూచీ కోసమా? లేక కోట్ల విలువైన స్థలాన్ని పరోక్షంగా హస్తగతం చేసుకోడానికా? ఏది నిజం?
ప్రస్తుతము గ్రంథాలయ స్థల విషయంలో రుద్రూర్లో ఏమి జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారకులు ఎవరు?
గ్రంథాలయ స్థలం ఇతర వ్యక్తుల పేరుపై కావడానికి ప్రధాన పాత్రధారులు ,సూత్రధారులు ఎవరు?
తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం ఇతరుల ద్వారా నిరసన చేస్తున్న వ్యక్తులపై అడ్డంకులు పెడుతున్నారా?
మహిళా మణులు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు? దీని వెనుక అంతర్యం ఏమిటి? వారికి భయభ్రాంతులకు గురిచేస్తుంది ఎవరు? ఎక్కడ తప్పు చేసిన వారు తప్పిదాలు బయటపడతాయని భయపడుతున్నారా? ఏది నిజం?
గతంలో మత్స్యకారులకు 10 లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్ మంజూరైనప్పుడు ఆ నిధులు వెనక పోయినప్పుడు ఎందుకు స్పందన లేదు? నాడు గ్రామాభివృద్ధి గుర్తుకు రాలేదా?
సిప్ మార్కెట్ లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల సమస్యలు కనిపిస్త లేదా? సిప్ మార్కెట్ కోసం వారికి స్థలం కేటాయించడంలో ఎందుకు అలసత్వం, నిర్లక్ష్యం చేస్తున్నారు, దీని వెనుక అంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నలు వెలువెత్తుతున్నారు,
60 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరైనప్పుడు అట్టి నిధులు వెనక్కి పోయినప్పుడు గ్రామాభివృద్ధి గుర్తుకు రాలేదా?
మహిళా మండలి స్థలంలో గ్రంథాలయ నిర్మాణం వద్దని ,గ్రంథాలయ స్థలం కోసం కేటాయించిన స్థలంలో గ్రంథాలయం నిర్మించాలని, వస్తున్న నిరసన రిలే దీక్షలు నేటికీ ఆరో రోజు,,,,
నాడు వెనక్కి వెళ్లిన నిధులపై లేని చిత్తశుద్ధి, నేడు గ్రంథాల నిధులు వెనక్కి పోతాయని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటి !గతంలో చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుకోవడం కోసమా? ఏది నిజం?
గ్రంథాలయ ప్రస్తుత కబ్జాదారుడు 2000 సంవత్సరంలో వార్డ్ మెంబర్ అయి తీర్మానంలో భాగస్తుడు అయినప్పుడు, ఆయన పేరుపై ఓనర్ షిప్ సర్టిఫికెట్ ఎందుకు పోయింది? ఎవరు ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు? ఇచ్చిన వారు ఎవరు? ప్రస్తుతం నిరసనలు, సెగల వల్ల తప్పిదాలు బయటపడతాయని అడ్డంకులు పెడుతున్నారా? అడ్డంకులు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రజలకు వెలువెత్తుతున్న ప్రశ్నలు ?సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
ఆ అక్రమాల పై నిఘా న్యూస్
ఎడిటర్ ✍️కట్టా నరేశ్ కుమార్ నాయక్.
📲7097988840
Comments
Post a Comment