*జర్నలిస్టులకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలి*
"జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని డిమాండ్"
జర్నలిస్టు బంధు పథకం ప్రవేశపెట్టాలి.తెలంగాణ ఉద్యమం కోసం జర్నలిస్టులు చేసిన పోరాటానికి కేసీఆర్ ప్రభుత్వం కృతజ్ఞత చాటుకోవాలి..- మంద కృష్ణ మాదిగ.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాజన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ MVJU ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ " తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల వార్తలు పంపే బాధ్యతతో పాటు ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చేందుకు పోరాటం చేసి బహుముఖ పాత్రను నిర్వర్తించారని అన్నారు.2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చిన వాటిని నెరవేర్చలేకపోయారని అన్నారు. జర్నలిస్టుల ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులు,హెల్త్ కార్డులు నేటికి సంపూర్ణంగా అందించలేకపోయారని అన్నారు. జర్నలిస్టుల ఆవేదనను చెప్పుకోవడానికి వారి ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సమాచార పౌర సంబంధాల శాఖను ప్రత్యెక మంత్రికి అప్పగించాలని అన్నారు. హైదరాబాద్ లో జర్నలిస్టుల భవన్ ను నిర్మించాలని అన్నారు. అలాగే కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినట్లుగా రిటైర్మెంట్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే పథకాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే దళిత బంధు లో ప్రత్యేక ప్రాధాన్యత జర్నలిస్టులకు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేసారు.
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం మహాజన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ పోరాటం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మతంగి దాసు, సుంచు అశోక్, సాయి రమేష్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment