*పోలీస్ సెలక్షన్ ఏర్పాట్లు ప్రారంభం*
*పోలీస్ సెలక్షన్ ఏర్పాట్లు ప్రారంభం *
నేటి నిఘా న్యూస్:
పోలీస్ కమీషనర్ కార్యాలయం నిజామాబాద్
*రేపటి నుండి పోలీస్ రిక్రూటుమెంటులో శారీరదారుఢ్య పరీక్షలు ప్రారంభం
: పోలీస్ కమీషనర్*
తేది: 08-12-2022 నుండి ఉదయం 5 గంటల నుండి ప్రారంభం కానున్న పోలీస్ శాఖ ఉద్యోగా ల భర్తీకి సంబంధించిన దేహ దారుఢ్య పరీక్షలకై రాజారామ్ స్టేడియం, నాగారాం లో ఏర్పాట్లను నిజామా బాద్ పోలీస్ కమీషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్., గారు పరిశీలించారు.
ఈసందర్భంగా స్టేడియంలోనికి ఎంట్రీ పాయింటు సర్టిఫికేట్లు వేరిఫికేషన్ కౌంటర్లు, వాట్అప్, బయోమెట్రిక్, రిస్టు బ్యాండ్, ఆర్.ఎఫ్.ఐ.డి సిస్టమ్, 800 మరియు 1600 మీటర్ల పరుగు ఏర్పాట్లు, ఎత్తు కొలవడం, లాంగ్ జంప్, షాట్ పుట్ ఏర్పాట్లు పూర్తిగా "ట్రాయల్ రన్" ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. విధినిర్వహణలో గల వారికి డ్యూటీ పాసులు, అభ్యర్థులకు ఎంట్రీ పాసులను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుందని "ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు ఉద్యోగం వచ్చేవిధంగా సహాయం చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని " అన్నారు. అభ్యర్థులు గ్రౌండ్లోనికి వచ్చి తమ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నుండి దేహా దారుఢ్య పరీక్షలు పూర్తిచేసుకొని బయటకువెళ్లేవరకు సిబ్బంది తీసుకోవలసినజాగ్రత్తల కోసం వివరించారు. ఏ మాత్రము ఏమరపాటు తగదని, ఖచ్చితత్వాన్ని పాటించే క్రమంలో సిబ్బంది కఠినంగా ఉండాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. అరవింద్ బాబు . అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శ్రీ గిరిరాజ్, ఎ.ఆర్. ఎ.సి.పి శ్రీ ఎన్. సంతోష్, ఎ.ఓ శ్రీ రామారావు, మ్యాగ్నిటిక్ ఇన్ఫోటిక్ ప్రయివెయిట్ లిమిటెడ్ ఇంచార్జీ శ్రీ మనికంఠ, ఎన్.ఐ.బి సి.ఐ శ్రీ ముఖీద్ పాషా, రిజర్వు ఇన్స్ పెక్టర్ శ్రీ అప్పలనాయుడు, సూపరింటెండెంటు శ్రీ శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ శ్రీ ఎస్. సంతోష్ రెడ్డి, ఐ.టి ఆర్.ఎస్.ఐ శ్రీ నిశీత్, టౌన్ 5 ఎస్.ఐ శ్రీ రాజేశ్వర్ గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment