"అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ పుస్తకాల పంపిణీ చేసిన సీపీ నాగరాజు"


*డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత రాజ్యాంగము పుస్తకాల వితరణ చేసిన పోలీస్ కమీషనర్*
నేడు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యలయంలోని మిని కాన్ఫెరెన్స్ హాల్లో *" కమ్యూనిటి కాంటాక్ట్ "* లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిండం జరిగింది. ఈ కార్యక్రమానికి " అభ్యుదయ సోషల్ వర్కర్ మరియు నేషనల్ ఫిలోషిప్ అవార్డు గ్రహీత ద ళితరత్న బంగారు సాయిలు సౌజన్యంతో నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ కె.ఆర్, నాగరాజు, ఐ.పి.యస్., గారు పాల్గొనడం జరిగింది.

ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పువ్వుల మాలలు వేసి క్యాండిల్ వెలిగించి, 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.

అనంతరం పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగము గురించి తెలుసుకోవాలని, ప్రతీ ఒక్కరు రాజ్యాంగాని ఆదర్శంగా తీసుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు సమాజంలో గౌరవంగా జీవించాలంటే ప్రతి ఇంట్లో ప్రతీ ఒక్కరు విధ్య అభ్యసించి ఉండాలని. అందుకోసం ప్రతీ ఒక్కరు చదువు కోవాలని అప్పుడు ఆఇల్లు ఎంతో అభివృద్ధి సాదిస్తుందని, వారికి అన్ని రకాల హక్కులు, భాధ్యతలు తెలుస్తాయని అన్నారు. ప్రతీ ఒక్కరు ఎల్లప్పుడు చట్టాలను గౌరవిస్తు ఉండాలని, ఎవ్వరో ఎమెచెప్పారు అని.. ఎదో చేయకూడదని, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ప్రతీ పని నిర్వహించాలని, అందుకోసం భారత రాజ్యాంగములో గల చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ఎవ్వర యితే చట్టాలను గౌరవిస్తారో వారికి అన్నిరకాల రక్షణ ఉంటుందని అన్నారు. మహిళా విధ్యార్ధినులు కూడా చదువులో ఎల్లప్పుడు ముందుడాలని ఆకాంక్షించారు.

అనంతరం భారత రాజ్యాంగము తెలుగు ముద్రణ కలిగిన దాదాపు 200 పుస్తకాలు వితరణ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. గారి చేతుల మీదుగా కాలేజీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ధళిత జిల్లా నాయకులు బాబురావ్, బి.సి. సంఘం శ్రీ రాజేశ్వర్, ఎడ్ల రాములు, ఎస్.టి సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీహరి నాయక్, మాలమహానాడు అధ్యక్షులు శ్రీ సక్కి విజయ్ కుమార్ , నీలకంఠేశ్వర గుడి మాజీచైర్మన్ శ్రీ గోపు ప్రభాకర్ ప్రజాసంఘాల జె.ఎ.సి మాచల్ శ్రీనివాస్.. శ్రీ రామచందర్ గైఖ్వాడ్, దళిత సంఘాల నాయకులు మరియు విధ్యార్థులు పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026