"160వ స్వామి వివేకానంద జయంతి"

 నేటి నిఘా న్యూస్:
న్యూస్ లైన్ ప్రతినిధి
(కట్టా నరేశ్ కుమార్ నాయక్ ✍️ జర్నలిస్ట్)
 
  *స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత భారతదేశ నవ సమాజ నిర్మాణంలో పాత్ర వహించాలి:...*

*నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.
 *వరంగల్ జిల్లా* 
 *నర్సంపేట నియోజకవర్గం* 
నర్సంపేట పట్టణంలో *స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలను* నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు *గోగుల రాణా ప్రతాపరెడ్డి* గారు యూత్ కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు ...
వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు... 
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వామి వివేకానందుడి జీవితం నేటి యువతకు స్ఫూర్తి అని వివేకానందుడు అత్యంత ఆదర్శ ప్రాయం కలిగిన వ్యక్తిగా భారతదేశంలో యువతకు స్ఫూర్తిగా నిలిచి, భారతదేశ గొప్పతనాన్ని, సంస్కృతిని హిందూమత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి  గా వెలుగొందాడని అన్నారు.. ప్రతి పౌరుడు వివేకానందుని బోధనలను తూచా తప్పకుండా పాటించి భారతదేశ నవ సమాజ నిర్మాణంలో పాత్ర వహించాలని అన్నారు. ఈ దేశంలోని యువత నిరాశ ,నిస్సృహాలకు లోనైనప్పుడు, ఏదైనా  సమస్యలు వచ్చినప్పుడు వైఫల్యాలు చవిచూసినప్పుడు వివేకానందుని బోధనలు ఆచరిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివేకానందుని స్ఫూర్తి భారతదేశానికే కాక ప్రపంచానికి కూడా తెలిసేలా పాటుపడాలని తెలిపారు. అదేవిధంగా ఇంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం మన నర్సంపేట పట్టణంలో లేకపోవడం చాలా దురదృష్టమని స్వామి వివేకనందుని విగ్రహాన్ని పట్టణం లో ఎర్పాటు చెయ్యడానికి తోడ్పుతామని *రాణా ప్రతాప్ రెడ్డి  అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026