"ఆలయ భూములు అవినీతి అడ్డుకునే నాధుడే కరువయ్యాడు"
నేటి నిఘా న్యూస్:
న్యూస్ లైన్ ప్రతినిధి.నెల్లూరు.
దేవాలయ భూముల పై అవినీతి అక్రమాల పై స్పెషల్ స్టోరీ.
(నిఘా న్యూస్ మీడియా)
కామాక్షి తాయి కి తీరని ద్రోహం చేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
👉జే సి అంటే లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్న ఈ ఓ
👉స్పందన ఆర్జీలను బుట్టదాఖలు చేస్తున్న వైనం
👉ఆలయ భూముల కబ్జా విలేకరి కి ఈ ఓ అండ
👉చట్టాన్ని పదే పదే ఉల్లంగిస్తున్న అవినీతి విలేకరి
👉కంటి తుడుపు చర్యలకే అధికారి పరిమితం
👉నిషిద్ద ఆలయ భూముల్లో విలేకరి అక్రమసాగు
అందుకు ఆలయ అధికారి సహకారం
👉ఆలయ భూముల్లో దష్టిబొమ్మలా హెచ్చరిక బోర్డు
👉దేవస్థానానికి కి పంగనామాలు పెట్టిస్తున్న ఈ ఓ
👉రిపోర్టు ఇచ్చి చేతులు దులుపుకున్న ఈ ఓ
👉విలేకరి పదే పదే చట్ట ఉల్లంగనలపై చర్యలు తీసుకోని అధికారి
👉ఈ ఓ అండతో యథేచ్ఛగా వరి సాగుచేస్తున్న విలేకరి
👉ఆలయ ఈ ఓ కనుసన్నలలో విలేకరి వివాదస్పద పనులు
👉నమ్మక ద్రోహపనులకు చిరునామాగా అధికారి విధులు
అధికారి నిలువెత్తు నిర్లక్ష్యంపై భక్తుల నిరసన
👉ఆలయ భూముల కబ్జా విలేకరితో ఈ ఓ ,ఏసీ కుమ్మక్కు
👉ఆలయ భూములను పరిరక్షించడంలో ఈ ఓ విఫలం
👉ఈ ఓ పనితీరుపై ఇదేమి ఖర్మ అంటున్న భక్తులు
👉భూములు కామాక్షితాయి వని తేల్చేసిన తహశీల్ధార్
👉కోటి రూపాయల ఆలయ భూమి అవినీతి విలేకరి కి ఈ ఓ సమర్పయామి
*******************
జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారికి మాటలు
రావని ఆమె ఎవరికి చెప్పుకోలేదని ఆలయ ఈ ఓగా విధులు వెలగబెడుతున్న వ్యక్తి యథేచ్ఛగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవార్లకు తీరని ద్రోహపు పనులు చేస్తున్నాడు .వివాదస్పద పనులు చేసే విలేకరి కబ్జాలో ఉన్న భూములు కామాక్షితాయి దేవస్థానానివని తహశీల్ధార్ తేల్చేసి అందులో ఎవరూ దిగకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు .కోటిరూపాయల విలువ చేసే భూమి ఆలయానిదికాదని విలేకరిదగ్గర చింతాకంత ఆధారం లేదు .అయినా విలేకరి హెచ్చరిక బోర్డు ని దిష్టిబొమ్మలా చేసి దౌర్జన్యంగా యథేచ్ఛగా వరిసాగు చేస్తున్నా అలయ ఈ ఓ కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యాడు .ఈ ఓ బలహీన విధులను ఆసరా చేసుకొని అవినీతి విలేకరి వేపుగా వారిపైరును పెంచుతున్నాడు .అక్రమంగా వరినాట్లు నాటినప్పుడు మాత్రమే విధిలేని పరిస్తితుల్లో ఈ ఓ పోలీసులకు రిపోర్టు ఇచ్చి కేసునమోదుకే పరిమితమై చేతులు దులుపుకున్నాడు .పదే పదే విలేకరి చట్టాన్ని ఉల్లంగించి నిషిద్ద ఆలయ భూముల్లో యథేచ్ఛగా వరి సాగు చేస్తుండేదానిని అలయ ఈ ఓ చట్టపరమైన కఠిన చర్యలు ద్వారా నియంత్రించకుండా చేతులెత్తేయడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు .విలేకరి చట్టాన్ని పదే పదే ఉల్లంగించి నిషిద్ద ఆలయ భూముల్లో వరి సాగు చేయడంపై పలువురు ఇరవై రోజుల వ్యవథిలో రెండుసార్లు స్పందనలో జేసి కి వచ్చిన వినతులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని ఆయన ఆదేశించినా జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ , ఆలయ ఈ ఓ
లు కుమ్మక్కై చర్యలు తీసుకోకపొగా స్పందన వినతులను బుట్టదాఖలు చేసి ఇద్దరూ అవినీతి విలేకరి కి అనుకూలంగా ఆపన్న హస్తం నిస్సిగ్గుగా అందిస్తూ కామాక్షి తాయి దేవస్థానానికి వ్యతిరేకంగా కాకమ్మ కబుర్లు చెబుతుండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది .కబ్జాకోరు విలేకరి ఆలయ భూములను సొంతం చేసుకునేందుకు హై కోర్టు కి వెళ్ళినా స్టే రాలేదు .అయినా క్షేత్రస్థాయిలో నిషిద్ద ఆలయ భూముల్లో ఎవరూ దిగకుండా కట్టడి చేయడంలో ఈ ఓ ,జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట కమిషనర్ లు తైతక్కలాటాడుతూ చట్టం పరువు నిలువునా తీస్తుండడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి .బీడుగా ఉన్న నిషిద్ద ఆలయ భూముల్లో ఎవరూ దిగకుండా హెచ్చరిక బోర్డు పెట్టడం ,అయినా అందులో విలేకరి వరినాట్లు నాటడం కేసుపెట్టాక కూడా వరిపైరుని వేపుగా పెంచుతూ ఆలయ భూములను సొంతం చేసుకోవాలనే విలేకరి దురాలోచనకు ఆలయ ఈ ఓ ,ఏ సి లు పూర్తి సహాయసహకారాలు అందిస్తూ భక్తుల చీదరింపులకు గురవుతున్నా చలనం ఉండడంలేదు .
అడిగేవారులేరని ఆలయ ఈ ఓ నిస్సిగ్గుగా అమ్మవారి భూములను పరిరక్షించడంలో నమ్మకద్రోహపు పనులకు పాల్పడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి .
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం లోని జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానానికి చెందిన ఖరీదైన భూములు పెనుబల్లి రెవిన్యూ గ్రామ పరిథిలో ఉన్నాయి .జొన్నవాడ గ్రామానికి చెందిన పగటి వేషగాడి ముసుగులో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న
కందికట్టు .వెంకటరత్నం తోపాటు అతని కుటుంబ సభ్యులు దేవస్థానానికి చెందిన భూములను దురాక్రమించి వాటిని లీజుకిచ్చి అలయానికి రూపాయి చెల్లించకుండా ఏటా లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు .కోటి రూపాయల విలువ చేసే భూములను కొట్టేయాలని ఎలాంటి నిర్థిష్టమైన డాక్యుమెంట్లు లేకనే రెవిన్యూ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి విలేకరి ,అతని కుటుంబ సభ్యులు రెవిన్యూ రికార్డులలో అక్రమంగా అనుభవదారులుగా నమోదు చేయించుకున్నారు .విలేకరి ఆలయ భూముల కబ్జాపై పలువురు గతఏడాది స్పందనలో కలెక్టరు కి పిర్యాదు చేయడం విలేకరి మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవారి దేవస్థానం భూములు కబ్జాచేసివుండేది
వాస్తవమని తేలింది .కబ్జాకి గురైన ఆలయ భూములు ఎవరివని తేల్చమని ఆలయ ఈ ఓ 27 .10 .2022 న తహశీల్ధార్ కి లేఖ రాశారు .దానిపై తహశీల్ధార్ విచారణకు అదేశించారు .వి అర్ ఓ ,అర్ ఐ 10 .11 .2022 న తహశీల్ధార్ కి నివేదికిచ్చారు .విలేకరి తోపాటు అతని కుటుంబసభ్యుల కబ్జా లో ఉన్న 518 ,521 ,523 సర్వే నెంబర్లలో లొని 4 .25 ఎకరాల భూమి జొన్నవాడ కామాక్షితాయి అలయానికి చెందినదని రెవిన్యూ ,ఆలయ రికార్డులు ధృవీకరిస్తున్నాయి .భూములు విలేకరితోపాటు అతని కుటుంబ సబ్యులవని ధృవీకరించే చింతాకంత ఆధారంలేదు .కాకమ్మకబుర్లు చిబితే వాటిని అధికారులు వినలేదు .నిషిద్ద ఆలయ భూముల్లో ఎవరూ దిగకుండా 13 .11 .2022 న హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు .అప్పటికి భూములు బీళ్లుగా ఉన్నాయి .అధికారుల హెచ్చరికలను భేఖాతరు చేసి విలేకరి తోపాటు అతని కుటుంబసభ్యులు నిషిద్ద ఆలయ భూముల్లో వరినాట్లు నాటడం వివాదాస్పదమైంది .దానిపై ఆలయ ఈ ఓ రిపోర్టు ఇవ్వడంతో విలేకరి వెంకటరత్నం తోపాటు అతని సోదరుడు ,తల్లి పై 267 /2022 క్రైమ్ నెంబర్ తో కేసు నమోదు చేశారు .అంతవరకు అందరూ సక్రమంగా విధులు నిర్వహించారు అంతవరకు బాగుంది .కేసు నమోదు చేసినా భేఖాతరు చేసి వ్యవసాయపనులు చేస్తూ వరి నాట్లను వరి పైరుగా పెంచుతున్నాడు .నిషిద్ద ఆలయ భూముల్లో చట్టాన్ని ఉల్లంగించి ఎరువులు చల్లుతూ ,క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు .తహశీల్ధార్ పేరుతో ఏర్పాటు చేసి న హెచ్చరిక బోర్డు ని అందరూ కలసి దిష్టిబొమ్మలా మార్చారు .చట్టాన్ని పదేపదే ఉల్లంగిస్తున్న విలేకరి ఆటలను చట్టపరంగా కట్టడి చేయకుండా అత్యంత నిర్లక్షన్గా విధులు నిర్వహిస్తున్నారు .ఆలయ భూములను స్వాహా చేసేందుకు విలేకరి తోపాటు అతని కుటుంబ సభ్యులు
అధికారుల చర్యలపై హై కోర్టు ని ఆశ్రయించినా స్టే రాలేదు .అయినా ఆలయ ఈ ఓ నిషిద్ద భూములకు వేలంపాటలు నిర్వహించి అలయానికి ఆదాయం సమకూర్చే పనులు చేయకుండా నమ్మకద్రోహం పనులు చేస్తున్నాడు .భూములకు వేలంపాటలు నిర్వహిస్తే విలేకరి భూముల్లోకి అక్రమంగా దిగే అవకాశం ఉండదు .చట్టవుల్లంఘనపై మారోసారి పోలీసులు కు ఈ ఓ రిపోర్టు ఇస్తే కటిన చర్యలు ఉంటాయి .అ దిశగా ఆలయ అధికారి చర్యలు తీసుకోకుండా అవినీతి విలేకరి ఆలయ భూముల్లో అక్రమంగా వరిసాగు చేసుకునేందుకు పూర్తిగా సహకరిస్తుండం వివాదాస్పదమవుతోంది .చట్టాన్ని పదే పదే విలేకరి ఉల్లంగిస్తుండడంపై స్పందనలో జే సి కి పిర్యాదు చేస్తే దానిపై జిల్లా దేవాదాయశాఖ ఏ సి తొపాటు ఆలయ ఈ ఓ చర్యలు తీసుకోకుండా విలేకరి కి మేలు చేసేలా అత్యంత నిర్లక్షన్గా విధులు నిర్వహిస్తున్నారు .జే సి ఆదేశాలను నిలువునా కూని చేసి స్పందన వినతులను అధికారుల హెచ్చరికలను భేఖాతరు చేసి విలేకరి తోపాటు అతని కుటుంబసభ్యులు నిషిద్ద ఆలయ భూముల్లో వరినాట్లు నాటడం వివాదాస్పదమైంది .దానిపై ఆలయ ఈ ఓ రిపోర్టు ఇవ్వడంతో విలేకరి వెంకటరత్నం తోపాటు అతని సోదరుడు ,తల్లి పై 267 /2022 క్రైమ్ నెంబర్ తో కేసు నమోదు చేశారు .అంతవరకు అందరూ సక్రమంగా విధులు నిర్వహించారు అంతవరకు బాగుంది .కేసు నమోదు చేసినా భేఖాతరు చేసి వ్యవసాయపనులు చేస్తూ వరి నాట్లను వరి పైరుగా పెంచుతున్నాడు .నిషిద్ద ఆలయ భూముల్లో చట్టాన్ని ఉల్లంగించి ఎరువులు చల్లుతూ ,క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు .తహశీల్ధార్ పేరుతో ఏర్పాటు చేసి న హెచ్చరిక బోర్డు ని అందరూ కలసి దిష్టిబొమ్మలా మార్చారు .చట్టాన్ని పదేపదే ఉల్లంగిస్తున్న విలేకరి ఆటలను చట్టపరంగా కట్టడి చేయకుండా అత్యంత నిర్లక్షన్గా విధులు నిర్వహిస్తున్నారు .ఆలయ భూములను స్వాహా చేసేందుకు విలేకరి తోపాటు అతని కుటుంబ సభ్యులు
అధికారుల చర్యలపై హై కోర్టు ని ఆశ్రయించినా స్టే రాలేదు .అయినా ఆలయ ఈ ఓ నిషిద్ద భూములకు వేలంపాటలు నిర్వహించి అలయానికి ఆదాయం సమకూర్చే పనులు చేయకుండా నమ్మకద్రోహం పనులు చేస్తున్నాడు .భూములకు వేలంపాటలు నిర్వహిస్తే విలేకరి భూముల్లోకి అక్రమంగా దిగే అవకాశం ఉండదు .చట్టవుల్లంఘనపై మారోసారి పోలీసులు కు ఈ ఓ రిపోర్టు ఇస్తే కటిన చర్యలు ఉంటాయి .అ దిశగా ఆలయ అధికారి చర్యలు తీసుకోకుండా అవినీతి విలేకరి ఆలయ భూముల్లో అక్రమంగా వరిసాగు చేసుకునేందుకు పూర్తిగా సహకరిస్తుండం వివాదాస్పదమవుతోంది .చట్టాన్ని పదే పదే విలేకరి ఉల్లంగిస్తుండడంపై స్పందనలో జే సి కి పిర్యాదు చేస్తే దానిపై జిల్లా దేవాదాయశాఖ ఏ సి తొపాటు ఆలయ ఈ ఓ చర్యలు తీసుకోకుండా విలేకరి కి మేలు చేసేలా అత్యంత నిర్లక్షన్గా విధులు నిర్వహిస్తున్నారు .జే సి ఆదేశాలను నిలువునా కూని చేసి స్పందన వినతులను బుట్టదాఖలు చేశారు .మసిపూసి మారెడుకాయలు గా చూపే తైతక్క పనులు దేవాదయ శాఖ అధికారులు చేస్తూ కబ్జా విలేకరితో కుమ్మక్కవడంపై భక్త్తులు ని రస న వ్యక్తం చేస్తున్నారు . అధికారులు అలయభూములను పరిరక్షించడంలో విఫలంకావడంపై పలువురు నిరాహారదీక్షలుకు సిద్ధమవుతున్నారు .
Comments
Post a Comment