*భార్యను చంపిన భర్త అరెస్ట్*

   నేటి నిఘా న్యూస్:

 క్రైమ్. న్యూస్: నిజామాబాద్ రురల్ పి. ఎస్. నిజామాబాద్. పరిధిలో 
క్రైమ్ నెంబర్- 51/2023  U/s 302, 498    శ్రీమతి గలండే సవిత , మారుతి, వయస్సు 38 సంవత్సరాలు, కులం: తెనుగు, వృత్తి, కులీ, భాగ్యనగర్ కాలనీ, ఖానాపూర్ గ్రామం, నిజామాబాద్.అరెస్టు చేసిన  సంఘటన పై మీడియా సమావేశంలో తేదీ:10.02.2023  నాడు  08.15 గంటలకు, ఖానాపూ లో నేరస్థుడు మారుతికి  2004 లో సవితతో వివాహమైంది, అప్పటి నుంచి వారు నిజామాబాదు లోని ఖానాపూర్ గ్రామంలోని భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్నారు. తన కుటుంబానికి జీవనోపాధి కోసం కూలి పని చేస్తున్నాడు.  వారికి పూజ, ఆర్తి మరియు పాయల్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు 2022 సంవత్సరంలో తమ పెద్ద కుమార్తె పూజ వివాహాన్ని మాధవ్ తో  జరిపించారు. మారుతీ మరియు అతని తల్లి సక్కుబాయిలు సవిత ను తరుచు మానసికంగా శారీరకంగా వేధించేది, మీ తల్లిగారింటి డబ్బులు తీసుకర అని వేధించేవారు.  అయితే మూడు సంవత్సరంలా నుండి, మారుతికి తన భార్య సవిత ప్రవర్తనపై అనుమానం వచ్చింది, ఆమె వారి కాలనీ వాసులైన ఇతరులతో తరచుగా మాట్లాడేది, మారుతీ అపరిచితులతో మాట్లాడకు అని ఆమెను బెదిరించాడు, కాలనీలో ఎవరితోనూ మాట్లాడవద్దని హెచ్చరించాడు కానీ ఆమె తన మాటలకు కట్టుబడి ఉండకపోవడంతో,  తేదీ 09.02.2023 మధ్యాహ్నం 12 గంటలకు  అతను తన భార్య సవితను నీ ప్రవర్తన మార్చుకో అని అనగా ఆమె అతనితో గొడవపడింది అప్పుడు మారుతీ అనుమానంతో ఆమె గొంతు పిసికి, బ్లవుజుతో ఆమె మెడకు గట్టిగ బిగించి చంపివేసి పారిపోయినాడు. భార్య పై అనుమానంతో హత్యా చేసిన నేరస్థుడు మారుతిని మరియు కోడలును మానసికంగా శారీరకంగా వేధించిన అతని తల్లి సక్కుబాయి లను సౌత్ రురల్ సర్కిల్ సి.ఐ జె. నరేష్ గారు పట్టుకొని వారిద్దరిని రేమండ్ కు తరలించుచున్నారు 
    ఈ రోజు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ ఎం.కిరణ్ కుమార్, సౌత్ రురల్ సర్కిల్ సి.ఐ జె. నరేష్ ,రురల్ యస్.ఐ G.లింబాద్రి , పి. ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026