"ప్రజారోగ్యం కాపాడే వారెరి?"

*నిజామాబాద్ డీ.ఎం&హెచ్.ఓ*
*సుదర్శన్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి.*
*DM &HO కార్యాలయ అవినీతిని ప్రక్షాళన చేయాలి.*
*ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలి.*
*~CPI(ML)ప్రజాపంథా డిమాండ్.*
నిజామాబాద్ జిల్లా వైద్యాధికారి (DM&HO) సుదర్శన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, DM&HO కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేయాలని, ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CPI (ML) ప్రజాపంథా నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 
ఈ సందర్భంగా CPI (ML) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ...
నిజామాబాద్ వైద్య ఆరోగ్యశాఖ (DM&HO) కార్యాలయం అవినీతికి నిలయమైందన్నారు. డి.ఎం.హెచ్.ఓ సుదర్శనం గారిపై అనేక అవినీతి ఆరోపణలు వున్నాయన్నారు.  సుదర్శనం గారి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలనీ, అప్పటివరకు అతన్ని భాద్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. DM&HO కార్యాలయంలోని అధికారులందరి అవినీతిపై విచారణ జరిపించి, కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. గత 04 సంవత్సరాలుగా DM&HO కార్యాలయం ద్వారా జరిగిన అన్ని నియామకాలపై విచారణ
జరిపించాలన్నారు. 
అద్దె వాహనాల బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నిజాయితీగా పనిచేసిన వాహన యజమానుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. సక్రమంగా నడిపి, తొలగింపుకు గురైన వారి వాహనాలు తిరిగి అద్దెకు పెట్టించాలన్నారు.
విధులు నిర్వహించకుండా వేతనాలు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా చెల్లించిన వేతనాలను రికవరీ చేయించాలన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
DM & HO కార్యాలయం ద్వారా జరిగిన అక్రమ నియామకాలను రద్దుచేసి, అర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
DM & HO కార్యాలయ అధికారుల కుటుంబ సభ్యుల, బినామీ పేర్లతో కొనసాగుతున్న అద్ది వాహన ఒప్పందాలను రద్దు చేసి, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. డిఎంహెచ్వో కార్యాలయ ప్రక్షాళన జరిగే వరకు, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టే వరకు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో PDSU  జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, నగర అధ్యక్షులు అషుర్, నగర ఉపాధ్యక్షులు మహిపాల్, ప్రజాపంథా నాయకులు  విఠల్, కిరణ్, సమీర్, ఫారూఖ్, అసిఫ్, గంగాధర్, రమేష్, గోపి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026