"అంతర్జాతీయ మహిళా హక్కుల కోసం పోరాటం"
*మహిళలపై కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు, మనువాద దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం!*
*~ప్రగతిశీల మహిళా సంఘం (POW) పిలుపు*
ప్రగతిశీల మహిళా సంఘం (POW) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం మార్చి 8 సందర్భంగా శ్రామిక భవన్ నుండి ర్యాలీ నిర్వహించి ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో సదస్సు జరపడం జరిగింది.
ఈ సదస్సుకు పి.ఓ.డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వి. గోదావరి అధ్యక్షత వహించారు.
ముఖ్య వక్తగా విచ్చేసిన CPI(ML) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ...
112 సంవత్సరాల క్రితం డెన్మార్క్ రాజధాని ఓపెన్ హగెన్ 1910 లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు మహిళ 2వ మహాసభ మార్చి 8 ని మహిళల హక్కుల, పోరాట దీక్షా దినంగా జరపాలని నిర్ణయించిందన్నారు.
మహిళలకు పనిగంటల తగ్గింపుకోసం, ఓటుహక్కు కోసం, వేతనాల పెంపుకోసం మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చి ఉద్యమ శంఖారావం పూరించారన్నారు.
పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను సైతం నేటి పాలకులు కాలరాస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో, ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాసిస్ట్ ప్రమాదం అన్ని రంగాల్లోనూ ముంచుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం కొద్దిమందిగా ఉన్న కార్పోరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నదన్నారు. భూములను ఖనిజసంపదను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను, రైల్వే, విమాన యానం, ఎల్ఐసి లాంటి సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు. లక్షల కోట్ల బ్యాంకు బకాయిలను రద్దు చేస్తున్నదని, రాయితీల రూపంలో, సబ్సిడీల రూపంలో కార్పొరేట్ సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తుందని దుయ్యబట్టారు.
ముంచుకొస్తున్న ఫాసిస్ట్ ప్రమాదంపై ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రత్యేకించి మహిళలు గళం విప్పాలన్నారు. పిడికిలి బిగించి కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు, మనవాద దాడికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు ఇస్తానని, నేటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నాదన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళలే ముందుండి పోరాడాలన్నారు.
పి.ఓ.డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి సంధ్యారాణి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యక్క, నాగమణి, శకుంతల
సహాయ కార్యదర్శిలు గౌర
జిల్లా నాయకులు జమున, పావని, అంబిక, నర్సక్క, గంగామణి, లక్ష్మి, చంద్ర, ఆశలత, రజిని, పుష్ప, మమత తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment