"దళితుల భూమి కబ్జాలు బిజెపి నాయకులు పై చర్యలు ఏవి?"

 *దళితుల భూమి కబ్జా చేసిన BJP నాయకులు*
నేటి నిఘా న్యూస్.
దళితుల భూమి కి రక్షణ కరువు
భూమి కోసం వస్తే చంపుతారా?...
దళితులు హక్కుల కు దిక్కెవరు?...

దళితుడు గొల్ల వరప్రసాద్ కు మంగళగిరి మండలం చిన్న కాకాని వద్ద అన్ని జిరాయితీ హక్కులతో ఉన్న భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని హత్యాప్రయత్నం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అతని అనుచరులు బిజెపి రాష్ట్ర మీడియా కన్వీనర్ లక్ష్మిపతి రాజా , బద్రి వెంకటరెడ్డి లపై  విచారణ జరిపి కేసులు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిజిపి కి ఈరోజు అర్జీ ఇవ్వడానికి అనుమతి నాలుగు రోజుల క్రితం అడగటం జరిగింది. కానీ కలవడానికి అవకాశం ఇవ్వకుండా గౌరవ లా అండ్ ఆర్డర్ ఐజీ అమ్మిరెడ్డి ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
    కలిసిన వారిలో  కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు,  హైకోర్టు అడ్వకేట్ సర్వేపల్లి సుదర్శన రావు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాలేటి మహేశ్వరరావు, పిల్లి సురేంద్ర బాబు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్, ఆలిండియా రైల్వే ఎస్ సి ఎస్ టి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పాబత్తిన గోవింద్ ,  బాధితులు గొల్ల వరప్రసాద్ తదితరులు ఉన్నారు.
     గౌరవ లా అండ్ ఆర్డర్ ఐజీ అమ్మిరెడ్డి గుంటూరు ఎస్ పి, విజయవాడ సిపి మరియు  మంగళగిరి డియస్పీ గార్లతో మాట్లాడి వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కారం చెయ్యాలని కోరారు.
దళిత హక్కుల నాయకులు 

న్యూస్ మీడియా గ్రూప్ 
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
ఎడిటర్ కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్
📱7097988840

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026