_టెన్త్ హిందీ పేపర్ బయటకు ఎలా వచ్చిందంటే...?_* లీక్? మస్ కాపీ?
*_టెన్త్ హిందీ పేపర్ బయటకు ఎలా వచ్చిందంటే...?_* లీక్? మస్ కాపీ?
తెలంగాణలో పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులు నిందితులను గుర్తించారు. హిందీ ప్రశ్న పత్రం ఎలా బయటకు వచ్చింది.?
*_వాట్సప్‌లో ఎవరు వైరల్ చేశారనే విషయాలు ఇవే.._*
‘‘కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. ఓ మైనర్ బాలుడు.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన తన మిత్రుడికోసం చెట్టు కొమ్మ పట్టుకుని ఒకటో అంతస్థులోని పరీక్షాకేంద్రంలోకి వెళ్లాడు. రూమ్ నెం.3 కిటికీ చెట్టుకు ఆనుకుని ఉంది. అందులో పరీక్ష రాస్తున్న హరీశ్ అనే విద్యార్థి వద్ద పేపర్ తీసుకుని సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. అనంతరం ఫ్రెండ్‌కు చీటీలు ఇద్దామని వెళ్లాడు. ఈ క్రమంలో ప్రశ్నపత్రం ఫొటోలను శివగణేష్‌కు పంపించాడు. ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్ గ్రూప్‌లో 31 మంది విద్యార్థులు ఉన్నారు. ఈగ్రూప్‌లో అదే ప్రశ్నపత్రం ఫొటోను శివగణేష్ పోస్టు చేశాడు. పరీక్ష ఉదయం 9.30 మొదలవ్వగా.. 9.45 గంటలకు బాలుడు ఫొటో తీశాడు.
9.55 గంటలకు శివగణేష్ ఎస్‌ఎస్‌సీ స్కూల్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఆ తర్వాత కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గుండెబోయిన మహేశ్((మాజీ విలేకరి)కి ఫార్వర్డ్ చేశాడు. మహేశ్ వెంటనే ఈ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్‌కు పంపించాడు. ‘శీను ఫ్రెండ్స్’ వాట్సాప్ గ్రూప్‌లో 10.46గంటలకు పోస్టు చేశాడు. అక్కడినుంచి వివిధ గ్రూప్‌లలో ప్రశ్న పత్రం వైరల్ అయింది. ప్రశాంత్.. ప్రశ్నపత్రం ఫొటోతో పాటు .. బ్రేకింగ్ న్యూస్ ‘వరంగల్‌లో హిందీ పేపర్ లీక్. ఉదయం 9.30గంటలకే లీకైన ప్రశ్నపత్రం. వరుసగా రెండో రోజు ప్రశ్నపత్రం లీక్. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్ వాట్సప్ గ్రూప్‌లో ప్రశ్నపత్రం ప్రత్యక్షం’ అని టెక్ట్స్ మెసేజ్ పెట్టాడు. విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేసే విధంగా ప్రచారం చేశాడు.
*_ప్రశ్న పత్రం లీక్ కాలేదట.!_*
ఈ మెసేజ్‌ను హైదరాబాద్‌లో ఉన్న కొందరు మీడియా ప్రతినిధులకు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు 11.24కు మెస్సేజ్ ఫార్వర్డ్ చేశారు. ప్రశ్న పత్రం లీక్ కాలేదు. లీకేజీకి కాపీయింగ్‌కు తేడా ఉంటుంది. పరీక్ష ప్రారంభం కాకముందు ప్రశ్నపత్రం బయటకు వస్తే లీక్. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత పేపర్ బయటకు వస్తే కాపీయింగ్ అవుతుంది. నిందితులపై సెక్షన్ 5 ప్రకారం కేసు నమోదు చేశాం. మైనర్ బాలుడిని జువైనల్ హోంలో హాజరు పరుస్తాం. శివగణేష్, ప్రశాంత్, మహేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దురుద్దేశ పూర్వకంగా చేసిన ఈ ప్రచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు.
*_అధికారులపై విద్యాశాఖ చర్యలు.._*
కమలాపూర్‌లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడంలో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. చీఫ్ సూపరింటెండెంట్ ఎం.శివ ప్రసాద్, డిపార్ట్‌మెంటల్ అధికారి టి.శ్రీధర్‌ను సస్పెండ్ చేసింది. పరీక్ష ఇన్విజిలేటర్ సబియా మదహత్‌ను సర్వీసు నుంచి తొలగించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఐదేళ్ల పాటు పరీక్ష రాయకుండా విద్యార్థిని విద్యాశాఖ డిబార్ చేసింది. నిన్న వికారాబాద్ ఘటనలో ఇన్విజిలేటర్లు బందెప్ప, సమ్మప్పను సర్వీసు నుంచి తొలగించిన విషయం తెలిసిందే.!
Comments
Post a Comment