"భూమి కబ్జా"

 *☆*☆జాజిరెడ్డిగూడెంలో పంట పొలానికి ఇంటి నెంబర్ కేటాయింపు.*
-------------------------------
*●జాజిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్  భర్త నిర్వాకం.*

*●ఆ అగ్రకులనేత  చేసిన భూ కబ్జా ను కప్పిపుచ్చే ప్రయత్నం.* 

 *● డిపివో ఆదేశాల మేరకు జరిగిన విచారణలో బయటపడ్డ నిజాలు.*

 *●గత 30 ఏండ్లుగా రైతు పేరున పట్టా,పాస్ బుక్ ఉన్నగాని దౌర్జన్యంగా కబ్జా చేసిన వైనం.*

 *●నేషనల్ హైవేకు అనుకోని పొలం    ఉండడమే రైతు పాలిట శాపంగా మారింది .*

*●ఆ అగ్రకులనేత కనుసన్నల్లోనే ఈ కబ్జా తతంగం .*

*●కబ్జా భూమిలో తన అనుంగు అనుచరుల సహాయం తో దౌర్జన్యంగా  మట్టి నింపిన పరిస్థితి.*

 *●పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం.*

*●ఆ అగ్రకుల నేతకు కబ్జా చేసిన భూమిలో తానే పొజిషన్లో ఉన్నట్లుగా రెవిన్యూ ధ్రువీకరణ పత్రం?.*

*●న్యాయం కోసం   కోర్టును ఆశ్రయించిన బాధిత రైతు... JSF*
------------------------------

 *సామాన్యుడి పచ్చని పంట పొలాలపై అధికార పార్టీ ఆ అగ్రకుల నేత కన్ను పడితే అంతే సంగతులు.*

*పంట పొలాలకు ఇంటి నెంబర్లు, కబ్జా చేసిన భూమిలో అనుంగు అనుచరులతో దౌర్జన్యంగా మట్టి పోయడం, రెవిన్యూ యంత్రాంగాన్ని ఉసిగొలిపి పొజిషన్లో ఉన్నట్లు కాగితాలు సృష్టించడం, అధికార దుర్వినియోగానికి ప్రత్యక్ష నిదర్శనం, అరాచకానికి పరాకాష్టగా ఈ కబ్జా వ్యవహారాన్ని చెప్పవచ్చు.*

 *తన పొలాన్ని ఆనుకుని జాతీయ రహదారి వెళ్లడమే ఆ రైతు పాలిట శాపంగా మారింది.*

*గత 30 ఏండ్లుగా రైతు పేరున పట్టా, పాసుబుక్ ఉన్న  దౌర్జన్యంగా పంట పొలాన్ని కబ్జా పెట్టడం, పైగా దాన్ని కవరింగ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలో గుట్టు చప్పుడు కాకుండా ఆ కబ్జా భూమికి ఇంటి నెంబర్ కేటాయించడం, తీరా డిపివో ఆదేశాల మేరకు జరిగిన విచారణ సందర్బంగా సహకరించకుండా దస్త్రాలను మాయం చేయడం.*

*అన్ని తెలిసి కూడా   జిల్లా పంచాయతీ అధికారి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్న దుస్థితి గురించి  ప్రత్యేక కధనం.*

వివరాల్లోకి వెళ్తే భాధిత రైతు తాటికొండ జగన్నాధం తండ్రి సత్తయ్య కధనం ప్రకారంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, మండలం జాజిరెడ్డిగూడెం పరిధిలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఇతనికి సర్వే నెంబర్లు 904,905ల్లో 2 ఎకరాల 26 గుంటల భూమి ఉంది.

ఈ భూమి కొంత తన తండ్రి నుండి  వారసత్వంగా సంక్రమించగా, మరికొంత భూమిని గత 30 ఏళ్ల క్రితమే  తన తోబుట్టువుల నుండి ఖరీదు చేసినట్లుగా, అప్పటి నుండే పట్టాదార్ పాస్ బుక్ కలిగి ఉన్నట్టుగా తెలిపారు.

తన కుటుంబ పోషణకు, జీవనాధారంగా ఈ భూమిపై వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

 ఈ క్రమంలో గత 4 సంవత్సరాల క్రితం బాధిత  రైతు పొలాన్ని అనుకొని నకిరేకల్-తానంచర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. దీని మూలంగా వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు వచ్చి ,వాటి డిమాండ్ పెరగడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇదే గ్రామానికి చెందిన  అధికార పార్టీ అగ్రకుల నేత ఒకరి కన్ను ఈ భూమి పై పడింది.అతని రాజకీయ, ఆర్ధిక, అంగ బలంతో 50 లక్షల రూపాయల మేర విలువైన భూమిని కబ్జా పెట్టడం జరిగింది.

ఈ అగ్రకుల నేత తన అనుంగు అనుచరుల సహాయంతో దౌర్జన్యంగా కబ్జా చేసిన భూమిలో మట్టి నింపిన పరిస్థితి నెలకొంది.

ఇంతటితో ఆగకుండా ఈ కబ్జా
వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన చెప్పు చేతుల్లో ఉన్న గ్రామ సర్పంచ్ ను ఉపయోగించుకొని గుట్టు చప్పుడు కాకుండా  ఈ వ్యవసాయ భూమికి ఇంటి నెంబర్ 7-91(1493)గా కేటాయించడం జరిగింది.

 ఈ సందర్భంలో బాధిత రైతు, కుటుంబ సభ్యులు కలిసి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కి పై విషయాలను తెలుపుతూ ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై గత ఏడాది మే నెలలో సూర్యాపేట జిల్లా డిపివో ఆదేశాల మేరకు స్థానిక మండల పంచాయతీ అధికారి జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టడం జరిగింది.

ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ కుంభం ఉషారాణి  భర్త కుంభం నాగరాజు గ్రామ పంచాయతీకి సంబంధించిన రివిజన్ రిజిస్టర్ ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా  తన ఆధీనంలో ఉంచుకొని విచారణ అధికారులకు ఇవ్వకుండా, విచారణకు సహకరించకుండా వ్యవహరించడం జరిగిందాని, ఇట్టి భూమి వ్యవసాయ భూమిగా రెవిన్యూ శాఖ పరిధిలో ఉందని అలాగే ఈ - పంచాయతీ పోర్టల్ లో గాని , గ్రామ పంచాయతీ డిమాండ్ రిజిస్టర్ లోగాని ఏ వ్యక్తి పేరు మీద ఇంటి నెంబర్ నమోదు చేయలేదని అన్ని స్పష్టంగా ధ్రువీకరించారు. ఇదే విషయాన్నీ స్థానిక ఎంపివో సందీప్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారికి రిపోర్ట్ పంపించారు.

 తమ నాయకుడి కబ్జా వ్యవహారం ఎక్కడ  వెలుగులోకి వస్తుందో అనే భయంతోనే జాజిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ కుంభం ఉషారాణి  భర్త కుంభం నాగరాజు  ఇలాంటి తప్పుడు చర్యలకు
 పాల్పడినట్లుగా   భాధిత రైతు స్పష్టం చేశారు.

గత నెల  జిల్లా డిపివో కు ఇట్టి విచారణ రిపోర్టు కొరకు
సమాచార హక్కు చట్టం  క్రింద   దరఖాస్తు చేయగా ఈ అవినీతి బాగోతానికి  సంబంధించిన పూర్తి ఆధారాలు,సాక్ష్యాలు లభించినట్టుగా తెలిసింది.

 ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసు,రెవెన్యూ యంత్రాంగం అనుసరించిన వైఖరి సామాన్యులను మరింత కష్టాల కొలిమిలోకి నెట్టేసే  విధంగా ఉందని చెప్పవచ్చు.

ఆ అగ్రకుల నేత స్థానిక మండల రెవెన్యూ అధికారుల్ని తన వైపు తిప్పుకొని కబ్జా చేసిన భూమిలో తానే పొజిషన్లో ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించి , దాన్ని కోర్టులో దాఖాలు చేసినట్లుగా బాధిత రైతు ఆరోపించారు.

ఈక్రమంలో రాజకీయ,
ఆర్థిక,అంగబలం లేని సామాన్య రైతు తన జీవనోపాధి కొరకు ఉన్న ఏకైక మార్గమైన వ్యవసాయ భూమిని రక్షించుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది.

 ఇకనైనా జిల్లా రెవిన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు, యంత్రాంగం మేల్కొని బాధిత రైతు కబ్జా వ్యవహారంపై దృష్టి సారించాలని, కబ్జాదారులని చట్టపరంగా శిక్షించాలని, అధికార దుర్వినియోగం చేసిన గ్రామ సర్పంచ్ భర్తపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని కోరుకుందాం . 

 సామాన్యు ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాలపై, దోపిడీ, పీడనలపై రాజ్యాంగబద్ధంగా  ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని, న్యాయం చేయాలని  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు... JSF

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026