12ఏళ్ళు మైనర్ బాలికపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడిన ముద్దాయికు 20 సంవత్సరాల జైలు శిక్ష
నేటి నిఘా న్యూస్
న్యూస్ లైన్ ప్రతినిధి :
దిశా డిఎస్పి ఎస్ వాసుదేవ్ అభినందించిన జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక
* 12ఏళ్ళు మైనర్ బాలికపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడిన ముద్దాయికు 20 సంవత్సరాల జైలు శిక్ష
* నిందితుడికి శిక్ష ఖరారు చేసిన గౌరవ మొదటి ఆదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ వారు
* కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడటంలో ఖచ్చితమైన సాక్షాదారులతో దర్యాప్తు పూర్తి చేసిన దర్యాప్తు అధికారి,కోర్టు మానిటరింగ్ పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక,
శ్రీకాకుళం జిల్లా
కేసు పూర్వపరాలు.
జలుమూరు మండలం,గుగ్గిలి పంచాయతీ,గుండువలస గ్రామంలో తేదీ 05..06..2021న రాత్రి 21.00 గంటలకు బాధిత మైనర్ బాలిక
మూత్ర విసర్జన చేయడానికి వీధి చివరకు వెళ్ళగా అదే గ్రామానికి చెందిన కుర్మాన సింహాచలం (నిందితుడు) మైనర్ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి నిర్మాణంలో ఉన్న ఇంటికి తీసుకెవెళ్లి నిందితుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో తీవ్ర రక్తస్రావం అయింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉండడంతో బాలిక ఏడ్చినప్పటికి ఎవరూ గుర్తించలేదు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో విలపిస్తున్న బాధిత బాలిక తల్లిదండ్రులు గమనించి వాస్తవాలు తెలుసుకుని వెంటనే గ్రామ పెద్దల సూచనలు మేరకు బాధిత బాలిక తల్లి జలుమూరు పోలీసు స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సి ఆర్ నెంబర్ .89/2021 యుయస్ 376(ఎ బి),363 ఐపీసీ అండ్ సెక్షన్ 5(ఎం) ఆర్ /డబ్ల్యూ 6 అఫ్ పోక్సో యాక్ట్ క్రింద
కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.అనంతరం దిశ పోలీసు స్టేషన్ డిఎస్పీ ఎస్.వాసుదేవ్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపించి,కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
కేసు విచారణ సమయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైడి రమణ మూర్తి ద్వారా సాక్షులను కోర్టు నందు హాజరుపరిచి,జిల్లా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్ష్యాధారాలు రుజువు చేయడంతో నిందితుడుకు ఈ దినం గౌరవ మొదటి ఆదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జి వారు 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ 6000 వేల రూపాయల జరిమానా విధించారు.
పై కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్టు లో ప్రవేశపెట్టి సమర్ధవంతంగా ట్రయల్ మానిటరింగ్ చేసి నిందితుడి కి శిక్షపడటంలో క్రియాశీలకంగా పనిచేసిన
NETI NIGHA NEWS
నేటి నిఘా న్యూస్ పేపర్
📞7097988840
Comments
Post a Comment