"రాజ్యాంగ హక్కుల కోసం అంబేద్కర్ పల్లెబాట"
*సింగుపురం దళితలకు ఆదుకోవాలి *
✍️నేటి నిఘా న్యూస్ 📰 పేపర్:
అంబేద్కర్ పల్లెబాటలో డి.హెచ్.పి.ఎస్.నేత యడ్ల గోపి డిమాండ్
పాతపట్నం, ఆగస్టు 8.పాతపట్నం మండలం సింగుపురం దళిత వాడలో నెలకొని ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి డిమాండ్ చేశారు.మంగళవారం నాడు సింగుపురం గ్రామంలో అంబేద్కర్ పల్లె బాట కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా దళిత వాడలోని ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.దళితులు ఊట బావిలో నీటిని త్రాగు నీరుగా ఉపయోగిస్తున్నారు.ప్రతీ ఇంటికి కొళాయిలు వేసి రక్షిత మంచినీరు సరఫరా చేయాలని కోరారు.సామాజిక భవనం,శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పించుటకు ప్రభుత్వం నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా అమలు నియోగించాలని కోరారు.నిలుపుదల చేసిన ఎస్సీలకు ఇచ్చిన 28 సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్ధరించి,అర్హులందరికీ
Comments
Post a Comment