" గిరిజన మహిళపై దాడి చేసిన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలి"
"గిరిజన మహిళపై దాడి చేసిన దౌర్జన్యం పై"
నేటి నిఘా న్యూస్:
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సపండి మమ్ముల సంపండి
మేము పురుగుల కన్న హీనం కదా సంపండ్రి
కొట్టండ్రి మమ్ముల ఇంక కొట్టండ్రి
కూసోరాకుండా లేవలేకుండ కొట్టండ్రి
మావి అగ్గువ పానాలు కదా కొట్టండ్రి
ఆ లాఠీలు,తూటాలు ఎక్కడ లేపాలి
ఎవరి మీద లేపాలి ఎలా లేపాలి
ఎక్కడెక్కడ లేపాలి ఎందుకు లేపాలి
అన్ని మా కింది కులాలను చూస్తేనే
యాదికొస్తయేంది సారు !
పోలీసు వాతలెప్పుడు
మా తొడలకే, మా వీపులకే ఉంటయ్ !
మేము తల్లినొప్పులకే పుట్టినం,
మాకు నొప్పి ఉంటది కదా సార్ !
ఎన్నడన్న ఆ దోసుకున్నొన్ని
చిటికెనేలుతోనైన కొట్టి ఉంటారా సార్,
మరి,మమ్ముల చూస్తే మాత్రం చిర్రెత్తుకొస్తది,
మీ లాఠీలకు పూనకమొస్తది
ఎక్కడ లేని బలమొస్తది ఎందుకు సార్
మా దేహాలు మీ లాఠీలు ఆడుకునే
ఆట స్థలాలు అనుకుంటారేమో కదా సార్
ఇంకెంత మంది ఖాదీర్ ఖాన్ లు, మరియమ్మలు,
చిరంజీవులు,ఇంకెంత మంది లక్ష్మీలు సార్
అంత మా 99% ఉన్న కులపోళ్ళమేనా?
మీకెంతో విలువతో మేము చేతి లేపి
సలాం కొడతాం సార్
మీరేమో మాకు విలువ లేనట్టు
గొడ్డును బాదినట్టు బాదితే ఎట్లా సార్.
మిమ్ముల నాలుగో సింహం అనుకుంటాం సార్
మామిద గాండ్రిస్తరని,మమ్ముల హింసిస్తరని కాదు
ఆ దోపిడీ క్రూర సంపద భక్షకుల నుండి
మాకింత రక్షణ ఇస్తరని
మీరే దగ్గరుండి మమ్మల్ని వాళ్లకు
మేతగా వేస్తే ఎట్టా సారు మాది పాణమే కదా !
దోచుకున్నోడు దాచుకున్నోడు బానే ఉన్నడు
మేమేం పాపం చేసినం సార్
లాకప్ డెత్ లు, థర్డ్ డిగ్రీలు మాకే దక్కుతున్నాయి
జర ఇప్పటికైన సోచాయించుండ్రి సార్
మావి పానాలే! మావి బతుకులే!!
Comments
Post a Comment