వైసీపీ అరాచకాలు అగాలి లేకపోతే టీడిపి సత్తా ఏంటో చూపిస్తా అంటున్న గౌతు.శిరీష
వైసీపీ అరాచకాలు అగాలి లేకపోతే టీడిపి సత్తా ఏంటో చూపిస్తా అంటున్న గౌతు.శిరీష
నేటి నిఘా న్యూస్ :
వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తల పై దాడులు చేస్తున్నారని, ఇప్పటి వరకు సహనంగా ఉన్నామని ఇక ఊరుకొనే ప్రసక్తే లేదని దాడికి ప్రతిదాడి చేయడం జరుగుతుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కు హెచ్చరించారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద మందస మండలానికి చెందిన తలగాన రాజశేఖర్ పై వైసిపి కార్యకర్తలు దాడికి నిరసనగా శాంతి నిరసన తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై, నా కుటుంబం పై గత నాలుగేళ్లుగా సోషల్ మీడియా సాక్షిగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న సహనంతో ఇప్పటి వరకు ఉన్నామని, ఇప్పటికైనా ఆపాలని హితవు పలికారు. ఇలాగే కొనసాగితే మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి ఫోటో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఇకనుంచి టిడిపి వాళ్లపై వైసిపి నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరగదని ప్రతి దాడికి చేసేందుకు సిద్ధం అవుతామన్నారు. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై వైసిపి నాయకులు దాడి చేస్తే పోలిసులు వైసిపి నాయకులకు వత్తాసు పలుకుతూ తిరిగి చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారంటే రాష్ట్రంలో పోలిసు వ్యవస్థ ఏలా అర్ధం చేసుకోవాలన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, టిడిపి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర శివాజీ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబురావు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి విఠల్ రావు, బిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు గురిటి సూర్యనారాయణ గాలి కృష్ణారావు, బి నాగరాజు, రవి శంకర్ గుప్త, జోగ మల్లి, అంబటి కృష్ణమూర్తి, బావన దుర్యోధన, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, సూరడ మోహన్ రావు, ఉమా మహేశ్వరావు, వసంత స్వామి, శశి భూషణరావు, మరడ దుర్యోధన, చిట్టి బాబు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న గౌతు శిరీష, శివాజీ, టిడిపి నాయకులు కార్యకర్తలు
వైసీపీ అరాచకాలు అగాలి లేకపోతే టీడిపి సత్తా ఏంటో చూపిస్తా అంటున్న గౌతు.శిరీష
NETI NIGHA NEWS
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
ఎడిటర్ కట్టా నరేష్ కుమార్ నాయక్
Comments
Post a Comment