*కళింగపట్నం బీచ్‌లో ఆమదాలవలస సమీపంలోని కృష్ణాపురానికి చెందిన కూన ప్రవీణ్‌*

  కళింగపట్నం బీచ్‌లో ఆమదాలవలస సమీపంలోని కృష్ణాపురానికి చెందిన కూన ప్రవీణ్
నేటి నిఘా న్యూస్: AP ; క్రైమ్ న్యూస్ 
 కళింగపట్నం బీచ్‌లో ఆమదాలవలస సమీపంలోని కృష్ణాపురానికి చెందిన కూన ప్రవీణ్‌ (14) మంగళవారం సాయంత్రం గల్లంతైపోయాడు. ప్రవీణ్‌ తల్లి తల్లి ఉష, మరో బంధువుతో కలి సి మంగళవారం సాయంత్రం బీచ్‌కు వచ్చాడు. కాసేపు స్నానం కూడా చేశాడు. తర్వాత చే తులు కడుక్కుని వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో నీటిలో పడిపోయి ఉంటాడని అంతా భావిస్తున్నారు.
వంశధార, సముద్రం సంగమ స్థలం కావడం, బురద నీరు ఉండడంతో యువకుడి ఆచూకీ దొరకలేదని పోలీసులంటున్నారు. మైరెన్‌ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ ఎన్‌.కామేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయి నా ఆచూకీ లభించకపోవడంతో అతడిడి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి తండ్రి ప్రసాదరావు మూడేళ్ల కిందటే చనిపోయారు. అన్నయ్య కార్తీక్‌ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026