"మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి"

"మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి" : నేటి నిఘా న్యూస్:
నేటి నిఘా న్యూస్: నిజమాబాద్ కోటగిరి,
 *మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిస్కరించని యెడల ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామన్నకార్మికులు* కోటగిరి సెప్టెంబర్ 23(నేటి నిఘా న్యూస్)నిజామాబాదు జిల్లా కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు సంబంధిత అధికారుల దృష్టిలో పలుమార్లు తీసుకువెళ్లినా ప్రయోజనం సమాధానం రావట్లేదాని,తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలలి స్థానిక కోటగిరి తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానిక డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి కార్మికుల సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందించారు,ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎవిటల్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల 19 నుండి మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సమ్మె కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలు  క్రితం సమ్మె నిర్వహిస్తుండగా విద్యాశాఖ మంత్రి పిలిచి మీ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పి రూ కనీస వేతనం 3000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేకపోయారని, మధ్యాహ్నం భోజనం కార్మికుల పెండింగ్లో ఉన్న బిల్లుని విడుదల చేయలేకపోయారని,కోడిగుడ్లు, రాగి,జావా ప్రభుత్వమే సరుపర చేస్తుందని చెప్పారని వాటి డబ్బులు కూడా చెల్లించలేకపోయారని, కార్మికులపై మోపలేని భారం పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించని యెడల మళ్లీ సమ్మె బాట కొనసాగడం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను విడుదల చేసి కనీస వేతనాలు అమలు చేయాలని లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు మధ్యాహ్నం భోజన కార్మికులకే డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం కేసీఆర్ దసరా నుంచి అల్పాహారం పథకాన్ని మొదలు  పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ అధ్యక్షులు భూమయ్య గంగమణి పుష్ప టి అనిత కృష్ణవేణి మనీ ఆరిపా  సావిత్రి ఉష తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026