మట్టి సేకరణ కార్యక్రమం
*హెగ్డోలి గ్రామంలో ఇంటింటికి తిరిగి మట్టి సేకరణ*
పోతంగల్ సెప్టెంబర్ 24(నేటి నిఘా న్యూస్)ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అమర వీరుల త్యాగాల గుర్తుగా స్మృతి వనం ఏర్పాటు చేయబోతున్నారు కావున భారత దేశ నలుమూలల నుండి మట్టి సేకరణ చేసి స్మృతి వనం ఏర్పాటు చేయడంలో మా భాగంగా హెగ్డోలి గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి మట్టి సేకరణ చేయడం జరిగిందని గ్రామస్థులు వివరించారు,ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం ఓబీసి మోర్చ అధ్యక్షులు నాగం సాయిలు,బూత్ కన్వీనర్ మారుతీ పటేల్,శక్తి కేంద్రం ఇంచార్జి సురేష్ కుమార్,కార్యకర్తలు మల్లికార్జున్ పటేల్,శివలింగ పటేల్,రంగారెడ్డి,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment