"వహీద్ కుటుంబానికి అండగా నిలిచిన ప్రెస్ క్లబ్ "

కోటగిరి సెప్టెంబర్ 26(నేటి నిఘా న్యూస్)
నేటి నిఘా న్యూస్ లైన్  ప్రతినిధి:
కోటగిరి మండలంలో రిపోర్టర్ గా పని చేస్తూ  ఇటీవల  గుండెపోటుకు గురై మృతి చెందిన వహీద్ అనే జర్నలిస్ట్ కుటుంబానికి కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. కుటుంబానికి పెద్దదిక్కైన వహీద్ అకాల మృతిపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రెస్ క్లబ్ సభ్యలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతనందించారు. తమ తోటి జర్నలిస్ట్ కుటుంబం పెద్దదిక్కును కోల్పోవటంతో వారికి బాసటగా నిలిచిన ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రెస్‌క్లబ్ నుండి సహాయం అందించటమే కాక దాతల సహాయతో వహీద్ కుటుంబీకులకు రూ.50 వేల నగదు  సహాయంతో పాటు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రభుత్వం తరపున అతని కుటుంబీకులకు గృహలక్ష్మీ పథకం కింద సొంత ఇల్లు నిర్మించుకునేందుకు స్థానిక సర్పంచ్ ఎజాస్ ఖాన్  నిధులు మంజూరు చేయించారు. వారి సొంతింటి నిర్మాణం పూర్తయ్యేవరకు  వహీద్ కుటుంబీకులు ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దెను సైతం ప్రెస్‌ క్లబ్ సభ్యుడైన హైమద్ ప్రతినెలా కట్టేందుకు ముందుకువచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా వహీద్ కుటుంబ సభ్యులు ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హన్మంత్‌రావు,కోశాధికారి కృష్ణకుమార్, జనరల్ సెక్రెటరీ బేగరి రాములు, సభ్యులు రాము,శ్రీకాంత్, సాయిలు, సైదయ్య, అనిల్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026