భగత్ సింగ్ జయంతి
*కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ ఆశయాలను సాదిద్దం -PDSU*
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
కామ్రేడ్స్ షాహిద్ భగత్ సింగ్ జయంతిని పాలిటెక్నిక్ బాలుర హాస్టల్లో జరపడం జరిగింది. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నుండి విముక్తికై భారతదేశ స్వాతంత్రానికై అతి చిన్న వయసులో అమరుడైన వ్యక్తి షహీద్ భగత్ సింగ్ అని అన్నారు. ప్రతి ఒక్కరం భగత్ సింగ్ ఆశయాల సాధనకై ముందుకు నడవాలని తెలిపారు. కుల,మత లింగ, వర్గ భేదాలు లేని సమాజానికై భగత్ సింగ్ పోరాడారని కొనియాడారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత విద్యార్థులపై ఉందని తెలిపారు. కులము, మతాలతో ప్రజలను రెచ్చగొడుతూ దేశాన్ని నాశనం చేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు అవలంబిస్తున్న ప్రజా,విద్య వ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని అధ్యయనం చేస్తూ పోరాడాలని ప్రగతిశీల విద్యార్థులుగా ఎదగాలని భగత్ సింగ్ ఆశయాలు సాధనకై ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు తిరుమలేష్, శ్రీకాంత్, రిషికేష్,త్రిషరన్,సూర్య, రఘురాం,రఘునాథ్, భారత్, జోహ్న,మనష్,విష్ణు,రేశ్వాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment