అక్రమంగా తరలిస్తున్న మొరం టిప్పర్లు అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు

 *రాంపూర్ నుండి మొరం తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు*     

              (నేటి నిఘా న్యూస్)
నిజామాబాదు జిల్లా కోటగిరి మండలంలోని రాంపూర్ నుండి మొరం టిప్పర్లతో కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలంలోని సిర్పూర్ గ్రామానికి మొరం తరలిస్తున్న టిప్పర్లను కోటగిరి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అడ్డుకుని స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు కోటగిరి తహసీల్దార్ కార్యాలయానికి మొరం టిప్పర్లను తరలించడం జరిగింది, ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాంపూర్ నుండి సిర్పూర్ కి మొరం తరలించడం  ఏమిటని ప్రశ్నించడం జరిగింది, స్థానిక తహసీల్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాంపూర్ నుండి సిర్పూర్ కి మొరం తిప్పర్ల ద్వారా రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది అని వివరించడం తో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమతి పత్రాలు పరిశీలించగా రాంపూర్ గ్రామానికి చెందిన రమ్యకృష్ణ అనే మహిళ పేరిట సర్వే నంబర్ 43/64/2 గల సర్వే నంబర్ లో 1ఎకరం 27గుంటల భూమి ఉందని పట్టాదారు సంతకం లేకుండా ఇతరుల సంతకాలు తీసుకుని అనుమతి ఇవ్వడం విడ్డురంగా ఉందని,మరొ సర్వే నంబర్ 42 సర్వే నంబర్ పై మొరం రవాణకు అనుమతి ఇచ్చిన అధికారులు పట్టాదారు పొలం పాసుబుక్కు జాతపర్చకుండా సంతకం తీసుకొని అనుమతి ఇవ్వడం ఏమిటని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటగిరి ఆర్ ఐ ని ప్రశ్నించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తూ సంభంధిత అధికారులపై మండి పడుతూ ఈ అక్రమంగా మొరం తరలిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని యెడల కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026