శ్రీ సరస్వతి గణేష్ కమిటీ అన్నదానం

*శ్రీ సరస్వతి గణేష్ మండలి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం సెప్టెంబర్ 26
(నేటి నిఘా న్యూస్)
నిజామాబాదు జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శ్రీ సరస్వతి గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా స్థానిక నిఘా న్యూస్ ప్రతినిధితో వారు మాట్లాడుతూ, కోటగిరి మండల కేంద్రంలో  శ్రీ సరస్వతి గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతీ సంహాత్సరం వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించిన తొమ్మిది రోజులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ అన్నదాన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మరియు వివిధ గ్రామాలలో నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు,ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి గణేష్ మండలి అధ్యక్షులు బొర్ర సాయికృష్ణ, ఉపాధ్యక్షులు కన్నం కార్తీక్, కార్యదర్శి కన్నం శ్రీకాంత్,కోటగిరి మండల ఎం. ఆర్.పి. ఎస్ ప్రధాన నాయకులు కన్నం సాయిలు,మాల మహానాడు కోటగిరి ఉపాధ్యక్షులు బేగరి రాములు,నంబర్ పోశెట్టి, పాల గంగారాం,ఎం. ఆర్. పి ఎస్ అధ్యక్షులు గుంటూరు శ్రీను,జెండా దినేష్,హస్కుల రవి, హస్కుల విజయ్, పేగు లాలయ్య,మహిళలు, యువతీ, యువకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026