పలాస లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
ఇక పలాసలో కేంద్రీయ విద్యాలయం..
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
* పలాస ఆర్మీ క్యాంటీన్ సందర్శనలో ఏపీ తెలంగాణ ఆర్మీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ రాకేష్ మనోచ వెల్లడి
పలాస పట్టణం, పరిసర ప్రాంతంలో CBSC సిలెబెస్తో కూడుకున్న "కేంద్రీయ విద్యాలయం" ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నామని హెడ్ క్వార్టర్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సబ్ ఏరియా ఆర్మీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ రాకేష్ మనోచ గారు అన్నారు.
ఆదివారం పలాస(చినబడం)లో ఆర్మీ క్యాంటీన్ సందర్శించి తనిఖీలు చేపట్టారు. అనంతరo మాజీ సైనికులు, ప్రస్తుత ఉద్యోగులు, వీర మహిళలు, వీర మాతృ మూర్తిలతో సమావేశం అయ్యారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ కుటుంబాల అవసరార్థం ఆర్మీ క్యాంటీన్ ఏర్పాటు చేయడం సంతోషం వ్యక్తం చేశారు, 12 మండలాల పరిధిలో 03 వేలమంది విశ్రాంత ఆర్మీ కుటుంబాలు ఉన్నాయని అన్నారు. ఇతర సౌకర్యాలకు అటు భరంపురం, ఇటు విశాఖ వెళ్లాల్సి వస్తుందని అన్నారు. విధులు ఓక చోట, స్వగ్రామం ఓక చోట, పిల్లల చదువులు ఓక చోట జరుగుతూ ఇబ్బందులు పడుతున్నామని పలాసలో ఆర్మీ పిల్లలకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ ఆర్మీ ఉన్నత అధికారులకు సమాచారం చేరవేసి పూర్తి అనుమతులు పొంది ఏర్పాటుకు సన్నాహాలు చేస్తామని మాటిచ్చారు.
రానున్న రోజుల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు పై స్పస్టత ఇస్తామని, వైద్య సేవలు నిమిత్తం పోలి క్లినిక్ పై చర్చిస్తామని అన్నారు. పలాసలో క్యాంటీన్ మరింత విజయవంతంగా నడుపుకొని ప్రతి ఒక్కరికి సద్వినియోగం కావాలని కోరారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ ఆర్మీ యూనిట్ అధికారులు విచ్చేశారు. ఈ సందర్భంగా పలాస మాజీ సైనిక సంక్షేమ సంఘం ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇళ్ళ మన్మధరావు, సభ్యులు బంగారు బారికి(తాతయ్య), ఆర్మీ క్యాంటీన్ మేనేజర్, కార్యవర్గ సభ్యులు, సిబ్బంది మాజీ సైనికులు, మాజీ అధికారులు, వీర మహిళలు, వీర మాతృమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment