బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జగనన్న-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి

 *బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జగనన్న-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి*
నేటి నిఘా న్యూస్ ✍️
*భీమిలి సామాజిక సాధికార సభలో మంత్రి ఘాటు వ్యాఖ్యలు.*

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.
అట్టడుగు వర్గాలు,బిసి లు అంటే చంద్రబాబుకు,తెలుగుదేశం పార్టీ నాయకులకు పడదని వారి ఎప్పుడూ కించపరుస్తూ వారి పైశాచికత్వం చూపిస్తుంటారని తెలిపారు.శనివారం భీమిలిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో  మంత్రి మాట్లాడుతూ
సంప్రదాయ వృత్తులు, సేవల ద్వారా ఆర్థిక, సామాజిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వర్గాల వారికి చంద్రబాబు పాలనలో ఏ రోజు గౌరవం దక్కలేదని అన్నారు. ఆ వృత్తులను చంద్రబాబు వంటి సీఎంలు నీచంగా, అపవిత్రంగా హేళనగా చూస్తూ అగౌరవించడం అనాగరిక పరిస్థితులు మనం చూశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగడానికి మొదటి కారకుడు చంద్రబాబు అని అన్నారు. బలహీనవర్గాలు దోపిడీకి గురయ్యాయని. పైగా, వారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీసి. హేళన చేశాడని ఆవేదన చెందారు. చిన్నచూపు చూస్తూ చంద్రబాబు తన ఫ్యూడల్‌ భావజాలంతో బీసీలకు అన్యాయం చేశాడని తెలిపారు. అందుకు తగిన మూల్యాన్ని 2019 ఎన్నికల్లో చెల్లించుకున్నారని  రాబోయే ఎన్నికలలో మరింతగా చెల్లించుకోక తప్పదని తెలిపారు.
 చంద్రబాబునాయుడు పాలనలో ఒకప్పుడు నాయీ బ్రాహ్మణుల పట్ల,మత్స్యకారులు, ఎస్సీల పట్ల ప్రవర్తించిన తీరు, చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏపీ ప్రజలకు ఇంకా గుర్తు ఉన్నాయని అన్నారు. 
మీడియా కెమెరాలు తన చుట్టూ ఉన్నాయని తెలిసినప్పటికీ అనగారిన వర్గాల పట్ల,బిసీల పట్ల,ఎస్సీల పట్ల అలా దురుసుగా, కర్కశంగా, ఉన్మాదంగా వ్యవహరించారంటే చంద్రబాబు తీరు మనకు అర్ధం కావాలని కోరారు. చంద్రబాబు,తెలుగుదేశం పార్టీ ఎప్పటికి పెత్తందార్ల పార్టీ అని వారి కోసమే ఆ నాయకత్వం పనిచేస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల కోసం పనిచేస్తారని అందుకే ప్రభుత్వ పాలనలో వర్గాలు లేవని,మ కులం లేదు,మతం లేదు అందరికి అందుబాటులో ప్రభుత్వ పరిపాలన ఉంచి సంక్షేమం అందిస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ రోజు భీమిలి లో బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని అన్నారు.ప్రజలు ప్రతి ఒక్కటి గమనించాలని కోరారు.

 వైసీపీ ప్రబుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత రాష్ట్ర చరిత్రలోనే లేదని  పేర్కొన్నారు . దేశ చరిత్రలోనూ ఎన్నడూ ఇది చూడలేదని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందిస్తుందని తెలిపారు. గత 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం అని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రస్తావించారు. చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టం కట్టిన ప్రభుత్వంకూడా మనదే అన్నారు. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందని ముఖ్యమంత్రి జగనన్న చెబుతుంటారని గుర్తు చేశారు. మూడవ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “సామాజిక సాధికార యాత్ర” చేపట్టారు. మనమంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలని. పేదవాడి విజయానికి బాటలు వేయాలని మంత్రి పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026