"అభివృద్దిని చూడలేని కబోది రామ్మోహన్ నాయుడు"
*అభివృద్దిని చూడలేని కబోది రామ్మోహన్ నాయుడు.*
నేటి నిఘా న్యూస్ ✍️
*మంత్రి అప్పలరాజు కోసం మాట్లాడే స్థాయి నీది కాదు.*
*మీ కుటుంబాలు చేసే అరాచకమే శాపంగా మారింది.*
*కుర్చీలు వేయడం అభివృద్ధి కాదు.*
*ఎంపి వ్యాఖ్యాలపై తీవ్రస్థాయిలో స్పందించిన వైసిపి నాయకులు.*
మంత్రి డాక్టర్ అప్పలరాజు కోసం మాట్లాడే అర్హత కింజరాపు రామ్మోహన్ నాయుడుకి లేదని పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తోపాటు పలువురు ద్వితీయ శ్రేణి వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. శనివారం స్థానిక ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన వారు ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు పై స్పందించారు.పలాస అభివృద్ధి కోసం కళ్ళుండి చూడలేని కబోదిలా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాడని అన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నాలుగున్నర సంవత్సరాలు అయ్యిందని రామ్మోహన్ నాయుడు అది ముందు తెలుసుకోవాలని కోరారు.అందునా కరోనా కష్టకాలం రెండు సంవత్సరాలు అంతటి కష్టాన్ని కూడా అధిగమించి నేడు అభివృద్ధి వైపు అడుగులు వేశాం అది తెలుసుకోవాలని అన్నారు. నీవు ఎంపి గా వెలగబెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా నీకు లేదంటే నిద్రలో ఉన్నావా అని ప్రశ్నించారు. మీ కుటుంబానికి ప్రజలు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చారో అదైనా నీకు తెలుసా అని అడిగారు. ప్రజలకు మీరు ఏమి చేశారో ఒక్కటైనా చెప్పగలవా రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఏళ్ళు తరబడి రాజకీయాలు చేసి అధికారంలో ఉన్న మీరు చేసింది రైల్వే స్టేషన్లలో కుర్చీలు వేయడం తప్ప నీవు చేసింది ఏమి లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వ్యవసాయ నీరు కోసం మాట్లాడుతున్నావు.మంత్రి నాలుగు సంవత్సరాలు ఏమి చేశారని మీ కుటుంబం,గౌతు కుటుంబం కలిసి ఏకంగా మా ప్రాంతం రైతుల పొట్టలు కొడుతున్న విషయం నీకు తెలియదా అని అడిగారు.
ఎగువ ప్రాంతంలో మీ చిన్నయ్య ఎత్తి పోతలు కట్టలేదని,అనధికార ఎత్తిపోతలు లేవని నీవు చెప్పగలవా రామ్మోహన్ నాయుడు అని ప్రశ్నించారు.
అసలు నీవు శ్రీకాకుళం ఎంపి వేనా.నీకు ప్రజలంటే బాధ్యత ఉందా. నీటి సమస్యలపై మీ చిన్నయ్యకు అడగు నిజం నీకే తెలుస్తోంది.అదీ నీకు భయం అయితే పలాస ప్రాంత రైతులంతా కలిసి ఎక్కడ ఎక్కడ ఎత్తిపోతలు కట్టారో చూడటానికి వెలదాం మాతో నీవు రాగలవా రామ్మోహన్ నాయుడు అని అన్నారు.
మైకు దొరికితే ఊక దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప నీవు చేసింది ఏమిటో ఒక్కటి చెప్పు అని అడిగారు.2014 లో ఎంపిగా చేశావు అప్పుడు మీ టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది.బిజేపి తో పొత్తులో ఉన్నారు.అయినా నీవు ఈ జిల్లాకు చేసింది శూన్యం.
పలాస కోసం నీవు ఏమి చేశావో అనేది మేము అడగటం లేదు.ఈ జిల్లాకు నీవు ఏమి చేశావు అని అడుగుతున్నాము సమాదానము చెప్పగలవా రామ్మోహన్ నాయుడు అని అన్నారు.పార్లమెంటు లో అవకాశం దొరికితే రెండు హిందీ ముక్కలు మాట్లాడుతావు అది మీ పచ్చ మీడియా ఆహా ఓహో అని చూపిస్తాది ఇంతకు మించి నీవు చేసింది ఏమిటో చెప్పాలని కోరారు.
పలాస అభివృద్ది కోసం నీకు కానీ మీ శిరీష అక్కకు కానీ మాట్లాడే అర్హత లేదన్నారు.
మీ శివాజి పెద్దయ్య గడ్డాలు పెంచి రైతులకు నీరందించేందుకు కష్టబడ్డారా. ఎంత అబద్దం ఆడావు అయ్య మీ పెద్దయ్య పెట్రోల్ బంకులు బిల్లులు అందడం లేదని గడ్డం దీక్ష పేరుతో కొత్త నాటకానికి తెర తీశాడు ఆ రోజుల్లో. బిల్లులు పడిన తరువాత దీక్ష విరమించి మీ బావకు అంతా అందించిన విషయం గుర్తులేదా మీకు అని అన్నారు. రైతుల కోసం నిజంగా మీకు చిత్త శుద్ధి ఉంటే మీ హయాంలో ఆఫ్‌షోర్ ఎందుకు పూర్తి చెయ్య లేదు.
వినే వాళ్లు ఉంటే మీ చిన్నయ్య,పెద్దయ్య,మీ శిరీష అక్క, నీవు ఇంగ్లీషు లోనే హరికథలు చెబుతారు.కానీ పలాస ప్రాంత ప్రజలు ఎంతో చైతన్య వంతులు మరచి పోవద్దు రామ్మోహన్ నాయుడు అని హెచ్చరించారు.
బిసిలకు అధికారం వచ్చిందని సంతోష పడ్డాం అనే నీ మాటలు వెనుక ఎన్నో కుట్రలు లేవా అని ప్రశ్నించారు. రైతులకు నీరు రాకుండా చేశారు.అభివృద్ధి జరుగుతుంటే అబద్దాలు చెప్పి అదని ఇదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇదేనా మీకు బీసి ల మీద ప్రేమ అని ఘాటుగా స్పందించారు.
మీ రెండు కుటుంబాలు రాజకీయాల్లో ఉండాలని ఆశ తప్ప ప్రజల కోసం మీరు చేసింది ఏమి లేదన్నారు.
అభివృద్ది కోసం మాట్లాడావు కదా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేసిన అభివృద్ధి చెబుతాము విను లేదంటే రా చూపిస్తాము అని అన్నారు.
1.ఉద్దాన కిడ్నీ రోగులకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి,పరిశోధన కేంద్రం. పూర్తి అయ్యింది కొన్ని రోజుల్లో జాతికి అంకితం చేయబోతున్నాము. 2. రూ.7 వందల కోట్లు రూపాయలతో ఇంటింటికి కుళాయి తో పరిశుద్ధ జలం అందించటానికి ఇప్పటికే పూర్తి అయ్యింది ట్రయల్ రన్ కూడా వేశారు. 3. కాశీబుగ్గ ఎల్.సి గేటు ఆర్.ఒ.ఆర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది (స్వర్గీయ అప్పయ్యదొర హయాంలో శంకుస్థాపన చేస్తే తరువాత వచ్చిన మీ ప్రభుత్వం ప్రక్కన పడేస్తే మా మంత్రి చొరవ తీసుకుని సమస్యలు తీర్చి ఇప్పుడు నిర్మాణం చేస్తున్నది మీకు కనిపిస్తుంది వెల్లి చూడండి).4.కాశీబుగ్గ పలాస కెటి రోడ్డు విస్తరణ,ఆధునీకరణ డ్రైనేజి,విద్యుత్ స్థంబాల నిర్మాణం ఇలా ఏక కాలంలో నాలుగు పనులు జరుగుతున్నాయి.త్వరలో జాతికి అంకితం చేయబోతున్నాం.5. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు దాహార్తిని తీర్చడానికి ఇంటింటికి మంచినీరు అందించడానికి రూ.100 కోట్లతో పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. 6. పలాస ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఉన్నత చదువులు అందాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకురావడం. దాని నిర్మాణం కోసం స్థలం సేకరించడం. ఇది ఒక ఎత్తు అయితే..ప్రస్తుతం తరగతులు జరుగుతున్న విషయం తెలుసుకో రామ్మోహన్ నాయుడు. 7. మందస పట్టణంలో రోడ్లు వెడల్పు చేయడం తోపాటు విద్యుత్ ఆధునీకరణ చేసి ఒక పట్టణం మాదిరి ఏర్పాటు చేశాం.
8. వజ్రపుకొత్తూరు నుండి పలాసకు వయా అక్కుపల్లి రహదారి అభివృద్ధి చేయడం.
9. నువ్వలరేవు మంచినీళ్ళపేట జట్టీ శంకుస్థాపన చేయడంతో అగకుండా అదే స్థానంలో ఒక హార్బర్ నిర్మాణం జరగాలని మత్స్యకారులకు ఉపాది కల్పించాలని ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు హార్బర్ నిర్మాణం కోసం పూర్తి స్థాయిగా ప్రణాళికలు చేశారు.
10. ప్రతి మండల కేంద్రంలో ఒక జూనియర్ కళాశాల మంజూరు.
11. మండలాల్లో పలు రహదారులు నిర్మాణం.
ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయన్నారు.
ప్రజలకు శాశ్వతంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో మా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పని చేస్తున్నారని తెలిపారు.12. ఒక వైద్యుడు కాబట్టే నియోజకవర్గంలో ప్రభుత్వం ఎన్నో కొత్త ఆసుపత్రులు నిర్మాణం చేపట్టిందని.పలాస ప్రభుత్వ ఆసుపత్రికి అధనపు నిధులు మంజూరు చేసి నూతన భవనాలు నిర్మించారని అన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే తపనతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు అభివృద్దికి అన్ని మౌలిక వసతులతో నూతన భవనాలు నిర్మించిన ఘనత మా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దని తెలియజేయడానికి వైకాపా కార్యకర్తలుగా గర్వపడుతున్నామని తెలిపారు.
ఒక విద్యావంతుడు కాబట్టే కొంత మంది పశువులు మాట్లాడిన వాటికి సహనంతో సంయమనంతో,ఓర్పుతో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు తప్ప మీలా రాజకీయ ప్రలోభాలకు లోబడటం లేదని చెప్పారు.13. మీ తండ్రి కాలం నాటి నుండి పోర్టు,పోర్టు అని మాటలు చెప్పారు. కానీ రూ 3500 కోట్లతో మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేసి ఇప్పుడు పనులు జరుగుతున్నట్లు చేసిన దమ్మున్న నాయకుడు మంత్రి అప్పలరాజు.రామ్మోహన్ నాయుడు ఇవి అభివృద్ధి పనులు కావా అని ప్రశ్నించారు.దాదాపు పదుల సంఖ్యలో అభివృద్ధి పనులు మేము చెబుతున్నాము. చూపించడానికి సిద్దంగా ఉన్నాం. నీకు దమ్ముంటే రాగలవా అని అడిగారు.
నీవు సింగిల్ గా వచ్చినా నీ వందిమాగదులతో కలిసి మీ అక్కతో కలిసి వచ్చినా మా మంత్రి చేసిన అభివృద్ధి చూపించగలం.నీ హయాంలో చేసిన ఒక్క అభివృద్ధి చూపించగలవా అడిగారు.ఈ సవాల్ ను స్వీకరించి మాట్లాడాలని కోరారు.
మీ కుటుంబం ప్రజల భావోద్వేగాలను అనుకువుగా తీసుకొని రాజకీయాలు చేశాయని ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి తరువాత ప్రక్కన పడేసే రాజకీయాలు మీవని రామ్మోహన్ నాయుడు పై తీవ్రస్థాయిలో స్పందించారు.
ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం,ఆరోగ్య కేంద్రం ఇలా ఇదో పెద్ద విప్లవాత్మక అభివృద్ధి ఇది కూడా నీకు మీ అక్కకి కనిపించడం లేదా అని అడిగారు.
కేసులు ఉన్న వారిని ప్రక్కన చేర్చుకున్నారని మాట్లాడవు కదా ఇది నీకు సిగ్గు ఉండాలని అన్నారు. మీ నాయకుడు పప్పు లోకేష్ బహిరంగంగా చెప్పిన మాటలు గుర్తు లేదా అని అడిగారు. ఎన్ని కేసులు ఉంటే టిడిపిలో అంత పెద్ద పదవులు ఇస్తాను అని చెప్పిన పార్టీ మీది నీవు సిగ్గుపడు ఇంతటి నీచ రాజకీయాలు మీవని వైసిపివి కాదన్నారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు దగ్గర ఆయన కోటరిలో కేసులు ఉన్న వారు ఎవరో చెప్పగలవా అని అడిగారు. రౌడీ రాజకీయాలకు,వెన్ను పోటు రాజకీయాలకు ప్రాణం పోసింది మీరని తెలిపారు.అమాయకుల ప్రాణాలతో చెలగాటం అడి వారిని అధికారంతో తొక్కేసే గుణం మీదని మరో సారి మా మంత్రి కోసం మాట్లాడితే తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు.
అభివృద్ధి చూసి ఓర్వ లేని కుట్ర రాజకీయాలు చేసే నీవా పలాస కోసం పలాస అభివృద్ధి కోసం మా నాయకుడు అప్పలరాజు కోసం మాట్లాడుతున్నావు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం ఏఎంసి చైర్మన్ పి.వి.సతీష్, పట్టణ అధ్యక్షులు సనపల సింహాచలం,పట్టణ అధికార ప్రతినిధి శిష్టు గోపి,కౌన్సిల్ ప్రతినిధి బల్ల శ్రీనివాస్,కో ఆప్షన్ మెంబర్ బమ్మిడి సంతోష్ కుమార్, రోణంకి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవాని,కౌన్సిలర్ గుజ్జు జోగారావు తోపాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Post a Comment