మహిళా ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిందే టీడీపీ, VOA ల సమస్యలు ధర్నాకు సంపూర్ణ మద్దతు
మహిళా ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిందే టీడీపీ, VOA ల సమస్యలు ధర్నాకు సంపూర్ణ మద్దతు
నేటి నిఘా న్యూస్: *మహిళా ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిందే టీడీపీ, VOA ల సమస్యలు ధర్నాకు సంపూర్ణ మద్దతు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్*
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు లో వెలుగు VOA లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న 36గంటల నిరవధిక దీక్షకు మద్దతుగా అరకు వ్యాలీ నియోజక వర్గ ఇంచార్జీ మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ న్యాయ భద్ధతు గా సమస్యలు పరిష్కరించాలనీ HR పాలసీ అమలు చెయ్యాలని, కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని అలాగే వెలుగు సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికాభవృద్ధికి కృషి చేసింది తెలుగు దేశం పార్టీ అని మీరు చేస్తున్న పోరాటానికి తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తామని టీడీపీ అధికారం లోకి వేస్తే మీ సమస్యలు అన్ని పరిష్కారం చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ వెంట VOA ల జిల్లా అధ్యక్షురాలు భాను ప్రధాన కార్యదర్శి రాజు కుమార్ సర్పంచులు వెంకట రమణ రాజు శశి భూషణ్ నాయుడు పాండు రంగ స్వామి అరకు పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు మాజీ వైస్ ఎంపీపీ పొద్దు అమ్మన్న స్టేట్ తెలుగు యువత ఆర్గనైజేషన్ కార్యదర్శి సాయిరాం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ రామలింగం యూనిట్ ఇంచార్జీ కళావతి అప్పలరాజు మహిళలు సౌజన్య రాధిక తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment