శివ శివా ఎములాడ రాజన్న...గిదెందయ్య...
శివ శివా ఎములాడ రాజన్న...గిదెందయ్య...
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రస్తుతము మేడారం జాతరను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు ముందుగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రవేశించింది మొదలు బయటికి వెళ్లే వరకు అడుగడుగునా ఆమ్యామ్యాలతో అవినీతితో ఆలయ ప్రాధాన్యతను తగ్గిస్తూ వున్నారు. చేయి తడపనిదే ఏ పని కాదు.ఎంతో దూరం నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వస్తే పూజారులు,బ్రోకర్లు,హోమ్ గార్డులు,విధులలో వున్న ,పోలీసు సిబ్బంది భక్తుల నుండి డబ్బులు వసూలు చేసి దర్శనం చేపిస్తో వున్నారు.క్యూ లైన్ లో బారులు తీరిన వారి దగ్గరకు వెళ్ళి లైన్ చాలా పెద్దగా వుందని చాలా సమయం పడుతుంది అని చెప్పి త్వరగా దర్శనం చేపిస్తామని వేరే దారి లో గుడి లోకి తీసుకువెళ్ళి ప్రతీ రోజూ వేలాది రూపాయలు సంపాదిస్తూ వున్నారు. ఆలయం దగ్గర డ్యూటీ కోసం అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది .బయట సామాగ్రి అమ్మే వారు ప్రతి ఒక్కరు అధిక ధరలకు వస్తువులు అమ్మి భక్తులను నిలువు దోపిడీ చేస్తూ పూర్తిస్థాయిలో మోసగిస్తున్నారు.ఈ విషయం బహిరంగం గా తెలిసినా ఎవరూ అడిగిన సందర్బాలు లేవు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు అత్యంత నిస్టతో వస్తారు. స్వామివారికి ఇష్టమైన సోమ మరియు శుక్రవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు కుటుంబ సభ్యులతో సహా రాజన్న సన్నిధికి చేరుకొని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఆలయంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు కోడెను కట్టే దగ్గర సరైన క్యూ లైన్ లేకపోవడం వల్ల ఇస్టారీతిగా కోడె ను కట్టు తున్నారు.కోళ్ల ధరలు అధికంగా వుండటం,నకిలీ బాట్లు , తూకాలలో మోసాలు బయట మార్కెట్లు దొరకడం అవినీతిని బట్టబయలు చేస్తుంది .బద్ది పోచమ్మ ఆలయంలో కూడా భక్తులు బోనాలతో బారులు తీరిన తర్వాత త్వరగా దర్శనం కావాలంటే బ్రోకర్ల ద్వారా ఎంతోకొంత చెల్లిస్తేనే నేరుగా చెంతకు తీసుకపోవడం వల్ల నిలబడిన భక్తులు గంటలకు వేచి చూస్తున్నారు. ఈ తతంగం ఆలయ కార్య నిర్వహణ అధికారికి, సిబ్బందికి తెలిసే జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా బద్ది పోచమ్మ ఆలయము లో సెక్యూరిటీ లో ఉన్న పోలీస్ సిబ్బంది దేవాదాయ శాఖ సిబ్బంది కూడా చేతులు తడిపిన వారికే నేరుగా దర్శనం చేపిస్తూ భక్తులను గంటల తరబడి నిలబడేలా చేస్తూ ఆలయ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. ఆలయ పరిసరాల్లో కొబ్బరికాయ కొట్టినా దర్జాగా కానుకలు ఇవ్వాల్సిందే ఇవ్వని ఎడల నానా మాటలు తిడుతూ ఏనాడైనా గుడికచ్చిన ముఖమా మీది కనీసం కానుకలు ఇవ్వరా అంటూ మరీ ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కోడె మొక్కుల టికెట్ తీసుకున్న డబ్బులు గుంజు తూ వున్నారు.బద్ధి పోచమ్మ దగ్గర మాత్రం మరీ దారుణం. బోనం ఇచ్చే ముందు శాక బెల్లం పోసే ముందు కూడా దక్షిణ చెల్లించాల్సిందే.మొత్తానికే రాజన్న దర్శనానికి వస్తె నిమ్మలం లేకుండా చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ గుడి పవిత్రత కి భంగం కలిగిస్తున్నారు.అధికారులు, దేవాదాయ ధర్మాదాయ మంత్రి వేములవాడ రాజన్న ఆలయము లో జరుగు తున్న ఈ అవినీతి అక్రమాల మీధ నిఘా వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకోవాలని మనవి.ఆలయాన్ని అభివృద్ధి చేయాలి.ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
కామిడి సతీష్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 9848445134
నేటి నిఘా న్యూస్
Comments
Post a Comment